Brahmastra: నాగార్జున, రాజమౌళితో కలిసి దక్షిణాది స్టైల్ లో సౌత్ ఇండియన్ ఫుడ్ ను రుచి చూసిన బాలీవుడ్ సార్ హీరో..
వాస్తవానికి రణబీర్ కపూర్, నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి చెన్నై లో లంచ్ చేశారు. రణబీర్ కపూర్, అలియా భట్ ల తాజా సినిమా బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
South Indian Lunch: దక్షిణాది వంటలు తినే పద్దతి అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఆహారం తినడానికి విస్తరాకులను వాడతారు. అరటి ఆకుల్లో పెట్టిన ఆహారపదార్ధాలను.. చేతితో తింటారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు సంప్రదాయం దక్షిణభారత దేశానికి మాత్రమే సొంతమని చెప్పవచ్చు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అరటి ఆకుపై సౌత్ ఇండియన్ ఫుడ్ తింటూ కనిపించాడు. వాస్తవానికి రణబీర్ కపూర్, నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి చెన్నై లో లంచ్ చేశారు. రణబీర్ కపూర్, అలియా భట్ ల తాజా సినిమా బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్. బ్రహ్మాస్త్రం సినిమా గురించి ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు కష్టపడి బ్రహ్మాస్త్ర సినిమా చేసినట్లు చెప్పారు.
ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన రాజమౌళి. అంతేకాదు.. మన పురాణాల్లో ఆయుధాల గురించి . వాటిల్లో రకాల గురించి చాలా విన్నాం, చదివాం. ఇప్పుడు ఈ ఆయుధాల కొత్త రూపాన్ని బ్రహ్మాస్త్రం సినిమా ద్వారా చూస్తాం. బ్రహ్మాస్త్ర చిత్రంలో హీరో ప్రమాదకరమైన విలన్లను తన వద్ద ఉన్న శక్తులతో పోరాడతాడని పేర్కొన్నారు. ప్రేమ అన్నింటినీ జయించగలదని ఈ సినిమా సందేశం ఇస్తుందన్నారు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర చివరి వెర్షన్‌ను ఉత్తమంగా రూపొందించడంలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే చెన్నైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారన్నారు రాజమౌళి
View this post on Instagram
“చెన్నై సంస్కృతి చాలా గొప్పదని.. ఇక్కడకు రావడం గొప్ప విశేషమని రణబీర్ చెప్పారు. తనకు దర్శకుడు అయాన్ ముఖర్జీ గురించి చాలా కాలంగా తెలుసని .. ఈ సినిమాని ఉత్తమంగా తెరకెక్కించడానికి ఆయన ప్రతి రోజూ ఎంతో తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు.
అమితాబ్ బచ్చన్, నాగార్జునతో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రణబీర్ చెప్పాడు. బ్రహ్మాస్త్ర సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా భారీ స్క్రీన్‌పై విడుదలవుతోంది. రణబీర్ కపూర్‌తో పాటు, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ వంటి బడా స్టార్స్ బ్రహ్మాస్త్ర చిత్రంలో నటించారు.
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..