Onion Rate: మార్కెట్లోకి 50 వేల టన్ను ఉల్లి.. ధరలు మళ్లీ పెరగనున్నాయా..? కేంద్రం చర్యలు ఏమిటి?

Onion Rate: భారతదేశంలో ఉల్లి ధరలు ఎల్లప్పుడూ చాలా సున్నితమైన అంశం. ఉల్లి ధర ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి. గతంలో ఉల్లి ధర కిలోకు..

Onion Rate: మార్కెట్లోకి 50 వేల టన్ను ఉల్లి.. ధరలు మళ్లీ పెరగనున్నాయా..? కేంద్రం చర్యలు ఏమిటి?
Onion Rate
Follow us
Subhash Goud

|

Updated on: Sep 08, 2022 | 12:35 PM

Onion Rate: భారతదేశంలో ఉల్లి ధరలు ఎల్లప్పుడూ చాలా సున్నితమైన అంశం. ఉల్లి ధర ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి. గతంలో ఉల్లి ధర కిలోకు రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయించిన సందర్భాలున్నాయి. ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉల్లి అంటేనే భయపడే రోజులు ఉండేవి. ప్రస్తుతం ఉల్లి ధర తక్కువగానే ఉంది. రుతుపవనాలు గతంలో అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వాలు సైతం టెన్షన్‌కు గురయ్యాయి. వర్షాకాలంలో సరఫరా లేకపోవడం, కొత్త పంట రాక ఆలస్యం కావడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. తరచుగా ఈ సమయంలో ఉల్లి 100 రూపాయల స్థాయికి చేరుకుంటుంది. అయితే ఈ ఏడాది సెప్టెంబరు మొదటి వారంలో సగటు ధరలు కిలో రూ.30 కంటే తక్కువగా ఉండడంతో మరింతగా పెరిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయితే అవ‌స‌ర‌మైనప్పుడు బ‌హిరంగ మార్కెట్‌లోకి 2.5 ల‌క్షల ట‌న్నుల ఉల్లిగ‌డ్డలు నిల్వ‌ల‌ను కొన‌సాగిస్తోంది. రబీ, ఖరీఫ్‌ సీజన్‌ల మధ్య తేడాతో సెప్టెంబర్‌-డిసెంబర్‌ నెలల్లో ఉల్లి ధర పెరుగుతుంటుంది. ఈ ధరలను పెరుగకుండా కేంద్రం చర్యలు చేపడుతోంది.

గత సంవత్సరాల్లో ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బఫర్ స్టాక్‌ను రూపొందించింది. దేశంలో ధరలు పెరుగుతున్న ప్రాంతంలో ఈ స్టాక్ నుండి సరఫరాను పెంచుతోంది. ఇటీవల ప్రభుత్వం తన బఫర్ స్టాక్ నుండి సుమారు 50,000 టన్నుల ఉల్లిపాయలను ఢిల్లీ, గౌహతి వంటి కొన్ని నగరాలకు తరలించాలని నిర్ణయించింది. ఇక్కడ ఉల్లి ధరలు భారత సగటు ధరల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి.

ఉల్లి ధరలను నియంత్రించేందుకు సరఫరాను పెంచారు:

ఇవి కూడా చదవండి

దేశంలోని కొన్ని ప్రాంతాలలో సగటు కంటే ఎక్కువ ధరలు ఉన్నప్పటికీ, మంగళవారం నాడు అఖిల భారత సగటు ధర కిలో రూ.26గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ తన బఫర్ స్టాక్‌లో ఉన్న 50,000 టన్నుల ఉల్లిపాయలను ఢిల్లీ, గౌహతి వంటి నగరాలకు విక్రయిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉల్లి అవసరం విషయంలో ఆర్డర్లు ఇవ్వాలని డిపార్ట్‌మెంట్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్లు వర్గాలు తెలిపాయి. కేంద్రం ఉల్లిని కిలో రూ.18కి ఇస్తోంది. ధరలు సగటు స్థాయి కంటే ఎక్కువగా ఉన్న నగరాల్లో సరఫరా పెరగడంతో సరఫరా పెరుగుదలతో ధరలు మితంగా ఉంటాయని భావిస్తున్నారు.

ఉల్లి పాడైపోయే స్వభావం, రబీ, ఖరీఫ్ పంటల మధ్య వ్యత్యాసం కారణంగా ఉల్లి ధరలు సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం ఉల్లి ధరలను స్థిరీకరించడానికి కేంద్రం 2.5 లక్షల టన్నుల ఉల్లిని విక్రయించనుంది. 2020-21 సంవత్సరంలో ఉల్లి ఉత్పత్తి 266.41 లక్షల టన్నులు, వినియోగం 160.50 లక్షల టన్నులు. నవంబరు నాటికి ఉల్లి కొత్త పంట రావడం ప్రారంభమవుతుంది. అంటే ప్రభుత్వాలకు ఉల్లిపాయల పరంగా సెప్టెంబర్ నుండి నవంబర్ చివరి వరకు సమయం ముఖ్యమైనది. నవరాత్రుల సమయంలో బఫర్ స్టాక్, శ్రాద్, ఉల్లి డిమాండ్ పడిపోవడం వంటి కారణాలతో ఈ ఏడాది ధరలు ఒక్కసారిగా పెరగకపోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పెరుగుదల ఉన్నప్పటికీ అది చాలా తక్కువ అని, రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వం చెబుతోంది.

ఉల్లి సరఫరా పెంపుపై ప్రభుత్వం దృష్టి:

ఉల్లి సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం నిల్వ నుంచి ఉత్పత్తి వరకు కొత్త టెక్నాలజీల వినియోగాన్ని పెంచింది. ఉల్లి పంటలో కోత అనంతర నష్టం సమస్యను పరిష్కరించడానికి డిపార్ట్‌మెంట్ చర్యలు ప్రారంభించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి