SBI Card: ఎస్‌బీఐ నుంచి సరికొత్త క్రెడిట్‌ కార్డు.. నగదు వెనక్కి.. అద్భుతమైన ప్రయోజనాలు!

SBI Card: ప్రస్తుతం బ్యాంకుల నుంచి కొత్త కొత్త క్రెడిట్‌ కార్డులు వస్తున్నాయి. క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. బ్యాంకులు రకరకాల ఆఫర్లు అందిస్తూ కార్డులను..

SBI Card: ఎస్‌బీఐ నుంచి సరికొత్త క్రెడిట్‌ కార్డు.. నగదు వెనక్కి.. అద్భుతమైన ప్రయోజనాలు!
Sbi Card
Follow us
Subhash Goud

|

Updated on: Sep 08, 2022 | 9:48 AM

SBI Card: ప్రస్తుతం బ్యాంకుల నుంచి కొత్త కొత్త క్రెడిట్‌ కార్డులు వస్తున్నాయి. క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. బ్యాంకులు రకరకాల ఆఫర్లు అందిస్తూ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇక తాజాగా ఎస్‌బీఐ నుంచి కొత్త క్రెడిట్‌ కార్డు వచ్చింది. క్రెడిట్‌ కార్డుతో నిర్వహించే అన్ని ఆన్‌లైన్‌ లావాదేవీలపై 5 శాతం వరకు నగదు వెనక్కి ఇచ్చేలా ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డును ఆవిష్కరించింది. క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డును వాడినప్పుడు సాధారణ లావాదేవీలపై 1 శాతం నగదు వెనక్కి వస్తుంది. అదే సమయంలో ఆన్‌లైన్‌ వ్యవహారాల్లో 5 శాతం నగదును క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌గా అందిస్తోంది.

ఒక బిల్లింగ్‌ నెలలో గరిష్టంగా రూ.10 వేల వరకు కొనుగోలుకే ఈ నగదు వెనక్కి వచ్చే సదుపాయం ఉండేది. కార్డు లావాదేవీలకు సంబంధించి స్టేట్‌మెంట్‌ వచ్చిన రెండు రోజుల్లో క్యాష్‌బ్యాక్‌ కార్డు ఖాతాల్లో జమ అయ్యేది. మిగితా బిల్లు చెల్లించాల్సి వచ్చేది. దీంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌లపై గరిష్టంగా రూ.100వరకు సర్‌ఛార్జీని రద్దు చేస్తుంది. ఈ క్రెడిట్‌ కార్డు వార్షిక రుసుము రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరంలో రూ.2 లక్షల వరకు బిల్లింగ్‌ చేసినప్పుడు ఈ ఫీజును వెనక్కి ఇచ్చేస్తుంది. మార్చి వరకు కార్డును తీసుకున్న వారికి మొదటి ఏడాది సభ్యత్వ రుసుము ఉండదని ఎస్‌బీఐ కార్డు తెలిపింది. ఇలా ఈ కార్డును తీసుకున్న వారు మంచి లాభం పొందవచ్చు. కార్డులను సరిగ్గా వినియోగించుకుంటూ సమయానికి బిల్లులు చెల్లించినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి