LG Smart TV: ఎల్‌జీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ టీవీ.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

LG Smart TV: ఎల్‌జీ బ్రాండ్‌లో LG టీవీలు చాలా ప్రీమియంగా పరిగణించబడతాయి. మీరు ఈ బ్రాండ్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఖచ్చితంగా Amazon డీల్‌ను..

LG Smart TV: ఎల్‌జీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ టీవీ.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..
Lg Smart tv
Follow us
Subhash Goud

| Edited By: Team Veegam

Updated on: Sep 08, 2022 | 3:44 PM

LG Smart TV: ఎల్‌జీ బ్రాండ్‌లో LG టీవీలు చాలా ప్రీమియంగా పరిగణించబడతాయి. మీరు ఈ బ్రాండ్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఖచ్చితంగా Amazon డీల్‌ను చెక్‌ చేయండి. అమెజాన్ ఇటీవల విడుదల చేసిన LG Inch Smart TVపై 40% వరకు తగ్గింపును ఇచ్చింది. ఈ LG TVలో AI ThinQ టెక్నాలజీ ఉంది. AI ThinQ సాంకేతికత కారణంగా సౌండ్‌ క్లారిటీతో వీడియో క్లారిటీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.ఈ టీవీలో స్మార్ట్ ఇంటెలిజెన్స్, వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉన్నాయి. ఈ టీవీ ధర రూ. 49,990 ఉండగా, ఈ డీల్‌లో 38% తగ్గింపుతో రూ. 30,990కి కొనుగోలు చేయవచ్చు. మీరు నో కాస్ట్ EMIలో టీవీని కొనుగోలు చేయాలనుకుంటే 1,481 చెల్లించి టీవీనీ కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ టీవీపై రూ. 3,760 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది.

LG టీవీలు సెగ్మెంట్ ప్రీమియం టీవీలుగా పరిగణించబడతాయి. LG కొత్తగా ప్రారంభించిన 43-అంగుళాల టీవీ 4K అల్ట్రా HDతో ఉంటుంది. ఇది AI ThinQ స్మార్ట్ టీవీ, దీని రిజల్యూషన్ 4K అల్ట్రా HD కాబట్టి మీరు ఈ టీవీలో వీడియోలను ఎంతో క్లారిటీగా చూడవచ్చు. టీవీలో AI బ్రైట్‌నెస్ కంట్రోల్ ఉంది. ఇది వీడియోను బట్టి క్లారిటీని మెరుగు పర్చుకుంటుంది. ఇందులో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉంది. దీంతో మీరు హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కమాండ్‌లను ఆస్వాదించవచ్చు. ఈ టీవీలో AI సౌండ్యు 20W సౌండ్ అవుట్‌పుట్, 2 ఛానల్ స్పీకర్లు ఉన్నాయి. టీవీలో ఆటో వాల్యూమ్ లెవలింగ్ ఉంది. టీవీలో 3 HDMI పోర్ట్‌లు, 1 USB పోర్ట్ ఉన్నాయి.

టీవీలో α5 Gen5 AI 4K ప్రాసెసర్ ఉంది. ఇది అపరిమిత OTT యాప్‌కు సపోర్టు చేస్తుంది. తద్వారా మీరు Netflix, Prime Video Sony Liv, Apple TV, Disney + Hotstar వంటి అన్ని యాప్‌లను చూడవచ్చు. ఈ టీవీ 1-సంవత్సరం వారంటీతో వస్తుంది. స్మార్ట్‌ టీవీలో ఏదైనా లోపం ఉంటే 10 రోజుల్లో భర్తీ చేస్తారు. ఇదే సిరీస్‌లో 55 అంగుళాలు, 65 అంగుళాల మరో రెండు స్మార్ట్ టీవీలు విడుదల చేయబడ్డాయి. 55-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 79,990 ఉండగా, 38% తగ్గింపు తర్వాత రూ. 49,490కి కొనుగోలు చేయవచ్చు. 65-అంగుళాల స్మార్ట్ రూ. 1,19,990 ఉండగా, 33% తగ్గింపు తర్వాత రూ. 79,990కి కొనుగోలు చేయవచ్చు. రెండు టీవీలపై రూ. 3,760 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి