Jio Recharge Plan: యూజర్లకు జియో బంపరాఫర్‌.. 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక రీచార్జ్‌ ప్లాన్‌..

Jio Recharge Plan: టెలికం రంగంలోకి పెను సంచలనంగా దూసుకొచ్చింది రియలన్స్‌ జియో. ఇంటర్‌నెట్‌ను ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జియోదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక జియో ప్రస్థానం...

Jio Recharge Plan: యూజర్లకు జియో బంపరాఫర్‌.. 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక రీచార్జ్‌ ప్లాన్‌..
Jio 6th Anniversary
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 08, 2022 | 6:30 AM

Jio Recharge Plan: టెలికం రంగంలోకి పెను సంచలనంగా దూసుకొచ్చింది రియలన్స్‌ జియో. ఇంటర్‌నెట్‌ను ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జియోదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక జియో ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా జియో మరో కొత్త రీచార్జ్‌ ప్లాన్‌తో యూజర్ల ముందుకొచ్చింది. జియో సేవలు ప్రారంభమై సెప్టెంబర్‌ 5 నాటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా జియో రూ. 2,999 ఇయర్లీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులకు 6 ప్రయోజనాలు లభించనున్నాయి. ఇంతకీ ఈ రీచార్జ్‌ ప్లాన్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటంటే..

ఈ ఇయర్లీ ప్యాక్‌తో యూజర్లకు అదనంగా 75 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే ఇక్సిగో కూపన్‌ ద్వారా రూ. 4500 అంతకంటే కొనుగోలుపై రూ. 750 తగ్గింపు పొందొచ్చు. అలాగే మ్యూజిక్‌ లవర్స్‌ కోసం జియో సావన్‌ ప్రో సేవల 6 నెలల ప్యాక్‌పై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా రిలయన్స్ డిజిటల్‌లో రూ. 5,000 కొనుగోలుపై రూ. 500 విలువైన తగ్గింపు పొందొచ్చు. ఇక నెట్‌మెడ్స్ కూపన్‌ల ద్వారా ఆన్‌లైన్‌ ఫార్మీసీలో కనీసం రూ.750 తగ్గింపు పొందొచ్చు.

ఇక మరో ప్రయోజనం ఏజియో కూపన్‌ ద్వారా రూ. 2,990 అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి రూ. 750 డిస్కౌంట్‌ లభిస్తుంది. వీటితో పాటు ఈ ప్యాక్‌తో 365 రోజుల పాటు రోజుకు 2.5 జీబీ డేటాను పొందొచ్చు. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. ఇంకా హాట్‌స్టార్‌, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్‌ వంటి సేవలను కూడా పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..