- Telugu News Photo Gallery Technology photos Redmi Launches new 5g smart phone Redmi 11 prime 5g features and price details Telugu Tech News
Redmi 11 prime 5g: తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా.? అయితే ఈ రెడ్‌మీ కొత్త మొబైల్ మీకోసమే..
Redmi 11 prime 5g: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రెడ్‌మీ 11 ప్రైమ్ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. సెప్టెంబర్ 9, మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 08, 2022 | 6:45 AM

త్వరలో భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెడ్‌మీ 11 ప్రైమ్ పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 13,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 15,999గా ఉంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను ఇచ్చారు. 90 హెచ్‌జెడ్ రిష్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే సొంతం.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్‌ఓసీ చిప్‌ను ఇచ్చారు. అలాగే 18 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 08 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఐపీ52 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఈ ఫోన్ ప్రత్యేకత.





























