AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lightning Safety Tips: పిడుగులు ఎందుకు పడతాయి?..ఆ సమయంలో ఏం చేయాలి..?

క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడినప్పుడు వాటిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడి మెరుపులు వస్తాయి. ఈ చర్య జరుగుతున్నపుడు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల్లో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. పిడుగులు పడతాయి.

Lightning Safety Tips: పిడుగులు ఎందుకు పడతాయి?..ఆ సమయంలో ఏం చేయాలి..?
Lightning
Sanjay Kasula
|

Updated on: Sep 08, 2022 | 8:51 PM

Share

పిడుగులు జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పిడుగు పాటుకు కొద్ది రోజులుగా మృత్యువాతపడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీనికి తోడు ఏపీలోని మూడు జిల్లాల్లో పిడుగులు పడతాయని RTGS పిడుగులాంటి వార్త ప్రకటించడంతో జనం మరింత హడలిపోతున్నారు. గతవారంలో ఒక్కరోజే పిడుగుపాటుకి నలుగురు మృతి చెందగా.. మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. అయితే ఇప్పడు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో జనం వణికిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో హడిలిపోతోంది. ఆంధ్రా, తెలంగాణలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతుండటంతో ఏ స్థాయిలో ప్రాణనష్టం కలుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. దీనికి కొనసాగింపుగా ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడతాయని అధికారులు హెచ్చరించారు.

పిడుగులు ఎలా పుడతాయి..?

హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు భయపెడుతున్నాయి. అయితే పిడుగులు ఎలా పుడతాయి అన్నదే అందరిలో కలుగుతున్న ప్రశ్న. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అయితే, పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువు ఉన్న ధనావేశిత(పాజిటివ్) మేఘాలు పైకి వెళ్తాయి.

ధనావేశిత మేఘాలు పైకి వెళ్లినప్పుడు.. అధిక బరువుండే ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న మేఘాలు కిందికి వచ్చేస్తాయి.  ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన నల్లని మేఘాల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయి. మనకు కనిపించే మేఘాలే కిందికి వచ్చిన ఎలక్ట్రాన్లు కలిగినవి.

చిన్నప్పుడు మనం సామాన్య శాస్త్రంలో చదువుకున్నట్లుగా.. రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. అప్పుడు.. ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోతాయి.. ఆ సమయంలో దగ్గరలో మరే ఇతర వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు దూసుకుపోతాయి. దీంతో మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. ఇలా రావడాన్నే పిడుగు పడటం అని అంటారు.

క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడినప్పుడు వాటిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడి మెరుపులు వస్తాయి. ఈ చర్య జరుగుతున్నపుడు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల్లో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. పిడుగులు పడతాయి.

పిడుగులు పడినప్పుడు ఎలా తప్పించుకోవాలంటే..

ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదని విపత్తు నిర్వహణ విభాగం సూచిస్తోంది. అంతే కాదు విపత్తు నిర్వహణ విభాగం కొన్ని సూచనలు కూడా గతంలో చేసింది.

  • మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఉరుములు పడుతన్నట్లైతే.. కారులోనే ఉండటం మంచిది.
  • వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం ఉత్తమం. భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.
  • చెట్ల కిందకు, టవర్ల కిందకు అస్సలు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
  • వర్షం పడుతున్న సమయంలో సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అస్సలు వినియోగిచ వద్దు. ఎందుకంటే పిడుగులను ఆకర్షించే గుణం వాటికి ఉంటుంది.
  • మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది.
  • భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.
  • నదుల్లో, వాగుల్లోని నీటిలో మనం ఉంటే సాధ్యమైనంత త్వరగా బయటకు రావాలి.
  • ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను కట్టి పెట్డడం మంచిది. విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే అవకాశం ఉంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం