Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru paksha 2022: పితృదేవతల ఆత్మశాంతి కోసం తప్పక చేయాల్సిన దానాలు.. ఇక మీ కష్టాలు తీరినట్టే..!

ఇకపోతే, మన పెద్ద వారికి తర్పణం వదిలిన రోజు ఇతరులకు దానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోబడతామని పండితులు చెబుతున్నారు.

Pitru paksha 2022: పితృదేవతల ఆత్మశాంతి కోసం తప్పక చేయాల్సిన దానాలు.. ఇక మీ కష్టాలు తీరినట్టే..!
Pitru Paksha
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2022 | 5:53 PM

Pitru paksha 2022: ప్రతీ ఏడాది భాద్రపదమాసంలో వచ్చే కృష్ణపక్షాన్ని పితృపక్షాలు అంటారు. ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 25 వరకు కొనసాగుతుంది. పితృ పక్షంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించారు. ఈ సమయంలో, గృహ ప్రవేశం, క్షవరం కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు వంటివి అస్సలు చేయరు. అదే సమయంలో, పితృ పక్షం జాతకంలో పితృ దోషాన్ని తొలగించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఈ రోజుల్లో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆశీర్వాదం పొందడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ పదహారు రోజుల పితృ వేడుకలో, మన పెద్దలు, పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని కొన్ని రకాల పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ పితృపక్షాలలో పూర్వీకుల ఆత్మల శాంతి కోసం కొన్ని రకాల వస్తువులను దానం చేయాలి. పితృదేవతల ఆత్మల సంతృప్తి కోసం శ్రద్ధా, తర్పణ రోజున దానం చేయవలసిన ఆ వస్తువులు, ప్రధాన్యత ఇప్పుడు తెలుసుకుందాం..

పితృ దినోత్సవం రోజున వారి ఆత్మల శాంతి కోసం దానం చేయవలసిన వస్తువులు.. నల్ల నువ్వులు.. దైవభక్తితో నల్ల నువ్వులను దానం చేయటం వల్ల మన పూర్వీకులు, దాతలు ఇద్దరూ ఫలితాన్ని పొందుతారు. పూర్వీకుల పేరిట దానం చేసినప్పుడు నల్ల నువ్వులు చేతిలో పట్టుకోవాలని అంటారు. ఈ కాలంలో మీరు ఇతర వస్తువులను దానం చేయలేకపోయినప్పటికీ, నల్ల నువ్వులు దానం చేయాలి. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల ఇబ్బందులు, విపత్తుల నుండి రక్షించబడతారని నమ్మకం. బట్టలు.. పితృకార్యాలు నిర్వహించే సమయంలో బట్టలు దానం చేయటం ఉత్తమం. శ్రద్ధా రోజున ధోతి, దుపట్ట దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. గరుడ పురాణం ప్రకారం, మనలాగే, మన పూర్వీకుల ఆత్మ కూడా రుతువుల మార్పు ద్వారా ప్రభావితమవుతుంది. వారు కూడా చలి, వేడిని అనుభవిస్తారు. కాబట్టి వారు తమ వారసుల నుండి బట్టలు కోరుకుంటారని,… ముందుగా బట్టలు దానం చేయాలంటారు. బెల్లం, ఉప్పు.. శ్రాద్ధ సమయంలో బెల్లం, ఉప్పును దానం చేయటం వల్ల మన పూర్వీకుల ఆత్మలు శాంతిని కలిగిస్తాయి.. వారి ఆశీర్వాదాలతో ఇంట్లో ఆనందం, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఉప్పును దానం చేయడం వల్ల మరణభయం కూడా తొలగిపోతుంది. కష్టాల నుండి విముక్తి పొందడం కోసం కూడా శ్రాద్ధ సమయంలో బెల్లం, ఉప్పును దానం చేయటం మంచిదంటున్నారు. చెప్పులు.. పూర్వీకుల ఆత్మ శాంతి కొరకు చెప్పులు(పాదరక్షలు) దానం చేయాలి. ఆ దానం తీసుకున్న వారు వాటిని ధరించడం ద్వారా మన పూర్వీకులు సంతోషంగా ఉంటారని విశ్వాసం. ఇలా చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి, పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయిని విశ్వాసం. గొడుగు.. శ్రాద్ధ సమయంలో గొడుగు దానం చేయడం శ్రేయస్కరం. ఇలా చేయడం ద్వారా, ఇంట్లో ఆనందం మరియు శాంతి చేకూరుతుంది. పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయి. వెండి వస్తువులు.. శ్రాద్ధ సమయంలో వెండి లోహంతో చేసిన ఏదైనా వస్తువును దానం చేయాటం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి, వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. వెండి చంద్రుడికి సంబంధించినది. అందుకే శ్రాద్ధలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి వెండి, బియ్యం, హలాన్ దానం చేస్తుంటారు. భూమి.. శ్రాద్ధ సమయంలో పూర్వీకుల ఆత్మశాంతి కోసం భూమిని దానం చేయాలని చెబుతారు. పెద్దల ఆత్మ శాంతి కోసం భూ దానం ఉత్తమ బహుమతిగా పరిగణించబడుతుంది. కానీ, నేటి కాలంలో అది అసాధ్యమనే చెప్పాలి.

ఇకపోతే, మన పెద్ద వారికి తర్పణం వదిలిన రోజు ఇతరులకు దానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోబడతామని పండితులు చెబుతున్నారు. అందుకోసమే ఎవరి తోచి దానాలు వారు చేస్తూ పితృదేవతలను పూజించుకోవటం ఉత్తమంగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి