Viral Video: ప్రాణాంతక చేపను టచ్‌ చేయాలనుకున్నాడు ఇక అంతే..! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

ఇవి అత్యంత ప్రాణాంతకమైనవి కాబట్టే వీటిని తినడానికి ప్రజలు భయపడుతుంటారు. కానీ, దక్షిణ కొరియా, చైనా, జపాన్‌ వంటి వంటి దేశాలు పఫర్ ఫిష్‌ను వంటకాలను రుచికరమైనదిగా భావిస్తాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన

Viral Video: ప్రాణాంతక చేపను టచ్‌ చేయాలనుకున్నాడు ఇక అంతే..! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
Dangerous Pufferfish
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2022 | 3:19 PM

Viral Video: పఫర్ ఫిష్.. ఇది భూమ్మీద అంత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన చేపలలో ఒకటి. ఈ చేప చూసేందుకు చాలా అందంగా, అమాయకంగా, మనిషి ముఖాన్నా పోలిన ఆకారంలో కనిపిస్తుంది.. కానీ, ఈ చేప నిజంగానే చాలా డేంజర్‌..చాలా విషపూరితమైనది. దీని కారణంగా మనుషులు పక్షవాతానికి గురవుతారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. దాదాపు 10 సంవత్సరాలు జీవించగలుగుతుంది. మనిషి మోమును పోలిన రూపంతో కనిపిస్తున్నఈ చేపను బొంక చేప, బెలూన్ ఫిష్, పఫర్ ఫిష్, గ్లోబ్ ఫిష్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. నార్మల్‌గా నీటిలో ఉన్నప్పుడు మామూలు చేపలానే ఉంటుంది. కానీ ఎవరైనా పట్టుకున్నా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని బంతిలా ఉబ్బుతుంది.

ఇవి అత్యంత ప్రాణాంతకమైనవి కాబట్టే వీటిని తినడానికి ప్రజలు భయపడుతుంటారు. కానీ, దక్షిణ కొరియా, చైనా, జపాన్‌ వంటి వంటి దేశాలు పఫర్ ఫిష్‌ను వంటకాలను రుచికరమైనదిగా భావిస్తాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన చెఫ్‌లకు మాత్రమే వాటిని సురక్షితంగా ఎలా పట్టుకోవాలో తెలుస్తుందట. అలా బెలూన్‌లా ఉబ్బిపోయిన పఫర్ ఫిష్‌ ఓ వ్యక్తిపై ఎలా దాడి చేసిందో వైరల్‌ వీడియోలో కనిపించింది. ఇప్పుడు అదే వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

పఫర్‌ ఫిష్‌ ఎంతటీ ప్రాణాంతకమైనదో తెలిసినప్పటికీ ఒక వ్యక్తి దాంతో ఆడుకోవాలని చూశాడు. చేతులకు గ్లౌసులు వేసుకున్న అతడు.. బెలూన్‌లా ఉబ్బిపోయిన చేపను కొద్ది కొద్దిగా టచ్‌ చేస్తూ ఆటపట్టించాలని చూశాడు..కాసేపు అది ఏమీ అనలేదు..కానీ, ఆ తర్వాత ఒక్కసారిగా పఫర్‌ ఫిష్‌ కున్న సూదుల్లాంటి వాటితో గుచ్చేసింది. ఇక అంతే అతడు..గిలగిలా కొట్టుకున్నాడు. ఈ వీడియోను ‘wildlifeanimal’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది 157k పైగా వ్యూస్‌,1,400 లైక్‌లతో వైరల్‌గా మారింది.

పఫర్‌ఫిష్‌ ఆటలాడరాదని చాలా మందికి తెలిసిన విషయమే కావటంతో..వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పఫర్‌ ఫిష్‌కి అతడి వేలు క్యారెట్‌లా కనిపించిందంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి