Pakistan floods: పాకిస్తాన్‌లో వరద బీభత్సం.. ప్రమాదపుటంచున మోహెంజొ దారో అద్భుత నిర్మాణాలు..
సింధు ప్రావిన్సులోని కరాచీ నుంచి లర్కానా మధ్య ఉన్న ఇటుక నిర్మాణాలను 1980లో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో ప్రకటించింది. అక్కడ హరప్పా నాగరికతకు చెందిన
Pakistan floods: పాకిస్తాన్‌లో కుంభవృష్టి ,వరద బీభత్సం కొనసాగుతోంది. వందేళ్ళలో కనీవినీ ఎరుగని రీతిలో పాకిస్తాన్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి పాక్‌లో సంభవించిన వర్షాలు, వరదలు అనూహ్యమైన రీతిలో నష్టాన్ని కలిగించాయి. ఈ ఏడాది పాక్ దక్షిణ ప్రాంతమైన సింధ్, బలోచిస్తాన్‌లలో వర్షాలు దంచికొడుతున్నాయి. దేశంలో మూడింట ఒక వంతు భాగం నీటిలో మునిగిపోయింది. పాక్‌లో కుంభవృష్టి ఎఫెక్ట్‌తో మనదేశంలోని రాజస్థాన్,గుజరాత్, రాష్ట్రాల్లో కనిపిస్తుంది.
మరోవైపు పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతంలో ఉన్న వారసత్వ నిర్మాణం మోహెంజొ దారో వర్షాల వల్ల దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 16 నుంచి 26 మధ్య .. మెహెంజొ దారోలో సుమారు 779.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీని వల్ల మోహెంజొ దారో ప్రాంతం చాలా వరకు ధ్వంసమైనట్టుగా అంచనా వేస్తున్నారు. సుమారు అయిదు వేల ఏళ్ల క్రితం నాటి నాగరికతకు చెందిన ఆ కట్టడాల్లో వర్షాల వల్ల పగులు వచ్చినట్లు సమాచారం. మోహెంజొదారోలో అనేక గోడలు స్వల్పంగా కూలినట్లు తెలిసింది. స్తూప డోమ్ రక్షణ గోడ కూడా స్వల్పంగా ధ్వంసమైనట్లు పాక్ ఆర్కియాలజీ అధికారులు చెబుతున్నారు.
సింధు ప్రావిన్సులోని కరాచీ నుంచి లర్కానా మధ్య ఉన్న ఇటుక నిర్మాణాలను 1980లో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో ప్రకటించింది. అక్కడ హరప్పా నాగరికతకు చెందిన పట్టణాలు ఉన్నట్లు కొందరు పురావాస్తు శాఖ నిపుణులు అంచనా వేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి