Viral: ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌కి గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చిన మంగోలియా అధ్య‌క్షుడు.. దాని పేరేంటంటే..?

ఏడేళ్ల క్రితం మంగోలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి గతంలో గుర్రాన్ని బహుకరించారు. ఈ క్రమంలోనే రాజ్‌నాథ్ సింగ్..

Viral: ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌కి గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చిన మంగోలియా అధ్య‌క్షుడు.. దాని పేరేంటంటే..?
Mongolian President Gifts
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 07, 2022 | 1:18 PM

Mongolian president gifts: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల మంగోలియా పర్యటనలో ఉన్నారు. మంగోలియాలో భారత రక్షణ మంత్రి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మంగోలియా అధ్యక్షుడు ఉఖ్‌నాగిన్ ఖురల్‌సుఖ్‌ను కలిశారు. ఈ సమావేశంలో ఆయన రాజ్‌నాథ్ సింగ్‌కు మంగోలియా రాజ గుర్రాన్ని బహుకరించారు. ఏడేళ్ల క్రితం మంగోలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కూడా నాటి మంగోలియా పాలకులు గుర్రాన్ని బహుకరించడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా తనకు బహుకరించిన తెల్ల గుర్రం ఫోటోలను రాజ్‌నాథ్ సింగ్ ట్విట్ చేశారు. దానికి క్యాప్షన్‌ ఇలా రాసుకొచ్చారు..

మంగోలియా నుంచి ప్ర‌త్యేక స్నేహితుల ద్వారా ప్ర‌త్యేక గిఫ్ట్ వ‌చ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. ఆ గుర్రానికి తేజ‌స్ అని పేరు పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడు కురేల్‌సుక్‌కు థ్యాంక్స్ చెప్పారు. ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మంగోలియా అధ్య‌క్షుడితో వ్యూహాత్మ‌క సంబంధాల‌పై చ‌ర్చించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి