AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mani Ratnam Dream Project: మణిరత్నం  పొన్నియన్ సెల్వన్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

ఇందులో భారీ తారాగణమే ఉంది. ఐశ్వర్య రాయ్, త్రిష, చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తి , జయరాం , ప్రకాష్ రాజ్ , ప్రభు, శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమాని..

Mani Ratnam Dream Project: మణిరత్నం  పొన్నియన్ సెల్వన్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?
Mani Ratnam Dream Project
Jyothi Gadda
|

Updated on: Sep 07, 2022 | 12:33 PM

Share

Mani Ratnam Dream Project: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ (పీఎస్-1) ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఫేమస్ రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రాత్మక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఇండియన్ జీనియస్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. తాజాగా ట్రైలర్ – ఆడియోను సూపర్ స్టార్ రజనీకాంత్- విశ్వనటుడు కమల్ హాసన్ సమక్షంలో ఘనంగా ఆవిష్కరించింది చిత్రబృందం. ట్రైలర్ ఇప్పటికే వెబ్ లో దూసుకెళుతోంది. చరిత్ర నేపథ్యంలో రాజులు రాజ్యాధికారం నేపథ్యంలో ఈ మూవీ ఆద్యంతం రక్తి కట్టించనుంది. భారీతనం నిండిన విజువల్స్ తో మణిరత్నం మరో అసాధారణ ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 30న ఫస్ట్ పార్ట్ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ఫిల్మ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంపైన ఫోకస్ పెట్టారు.

ఇకపోతే, ఈ చిత్రంలో జయం రవి- విక్రమ్- కార్తీ- త్రిష- ఐశ్వర్యారాయ్ లాంటి భారీ తారాగణం నటించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇందులో భారీ తారాగణమే ఉంది. ఐశ్వర్య రాయ్, త్రిష, చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తి , జయరాం , ప్రకాష్ రాజ్ , ప్రభు, శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమాని తెరకెక్కించేందుకు మూడు దఫాలు ప్రయత్నించి విఫలమయ్యారట. తమిళ దివంగత రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కింది.

మూడు దశాబ్ధాల క్రితమే ఈ నవలను సినిమాగా తీయాలని మణిరత్నం కలలుగని ప్రయత్నాలు ప్రారంభించారు. వేర్వేరు కాలాల్లో వేర్వేరు స్టార్ హీరోలను సంప్రదించినా కానీ సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే, అప్పట్లో రామ్ చరణ్ ని కూడా మణిరత్నం సంప్రదించగా అది ఎందుకనో వీలుపడని సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైకా సంస్థ మద్ధతుతో మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. 1989లోనే చర్చ ప్రారంభిస్తే ఇప్పటికి పూర్తయి రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే, మొదటిసారి ప్రయత్నంలో విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో సినిమా చేయాలని మణిరత్నం భావించారని విశ్వనటుడు కమల్ హాసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కల్కి కృష్ణమూర్తి ‘కల్కి’ మ్యాగజైన్ చిట్ చాట్ లో అసలు సంగతిని రివీల్ చేసారు. ప్రభు సత్యరాజ్ తనతో కలిసి నటించేందుకు అంగీకరించారు. పీసీ శ్రీరామ్ – ఇళయరాజా వంటి టాప్ టెక్నీషియన్లను కూడా సంప్రదించారు మణిరత్నం. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. తర్వాత చాలామంది స్టార్లను మణిరత్నం సంప్రదించారు.

అలాగే అప్పట్లో కమ్ హాసన్ తో ఈ చిత్రానికి రూ.2 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాలని కూడా భావించారట. కానీ ఇప్పుడు ఏకంగా 350-400 కోట్ల మధ్య బడ్జెట్ తో పొన్నియన్ సెల్వన్ ని మణిరత్నం తెరకెక్కిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాని 2డి- 3డి ఫార్మాట్ లో విడుదల చేస్తారని కూడా టాక్ ఉంది. సెప్టెంబర్ 30న పీఎస్ 1 తెలుగు-తమిళం-హిందీ సహా పలు భాషల్లో అత్యంత భారీగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగించింది. ఇందులో చియాన్ విక్రమ్ యాక్టింగ్ ఇరగదీశాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి