Benefits of Incense: ఇంట్లో వేసే ధూపం వెనుక అసలు రహస్యం..! ఆ దిశగా వేస్తే అధిక ప్రయోజనం,లక్ష్మీ అనుగ్రహం..

ధూపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒక ప్రత్యేక వాసన మెదడు నొప్పి, సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు..

Benefits of Incense: ఇంట్లో వేసే ధూపం వెనుక అసలు రహస్యం..! ఆ దిశగా వేస్తే అధిక ప్రయోజనం,లక్ష్మీ అనుగ్రహం..
Incense
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 07, 2022 | 11:03 AM

Benefits of Incense: పూజాది కార్యక్రమాలు, ఆరాధన సమయంలో దీప ధూపం తప్పనిసరి. దూపం వేయటం, అగరుబత్తులు వెలిగించటం సర్వసాధారణం. దాంతో ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ధూపం కేవలం సువాసన కోసం మాత్రమే కాదు..ఇది అనేక శుభ ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ధూపం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధూపానికి సంబంధించిన కొన్ని నివారణలు ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా సంసృతుల్లో వాడే పురాతన పద్దతి ఇది. ధూపం లేదా సాంబ్రాణి వెయ్యడం మైండ్ ను రిలాక్స్ చేసి మనసుకు ప్రశాంతతనిస్తుంది. మంచి పరిమళాలు ఒత్తిడిని తగ్గించి మన పనిలో నాణ్యత పెంచుతాయి. మంచి పరిమళం ఉన్న ఇంట్లోకి దేవతలు వస్తారని నమ్ముతారు. సాయంత్రం పూట ధూపం లేదా సాంబ్రాణి వేసి మంచి పరిమళం ఉండేలా చూసుకోవాలి.

ధూపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒక ప్రత్యేక వాసన మెదడు నొప్పి, సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండె నొప్పికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

ధూపం వెలిగించడం వల్ల గృహ వివాదాలు, పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ, దైవిక శక్తులు ఆకర్షించబడతాయి. అవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజగదిలో ధూపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మి అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తుంది.

దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు. ప్రతిరోజూ ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజగదిలో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే, మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు.

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి