Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru Paksham: ఈసారి పితృ పక్షాలు ఎప్పుడొస్తున్నాయి..పితృ పక్ష తేదీ, ప్రాముఖ్యత, చేయవలసినవి, చేయకూడనివి ఇవి..?

పితృ పక్షం ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల పక్ష పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమిని పితృ పక్షానికి..

Pitru Paksham: ఈసారి పితృ పక్షాలు ఎప్పుడొస్తున్నాయి..పితృ పక్ష తేదీ, ప్రాముఖ్యత, చేయవలసినవి, చేయకూడనివి ఇవి..?
Pitru Paksham
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 06, 2022 | 9:58 PM

తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం – ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తుంది.. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం, సూర్యమాన పంచాంగం. పితృ పక్షం ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల పక్ష పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమిని పితృ పక్షానికి నాందిగా పరిగణిస్తారు. పితృ పక్షంలో పూర్వీకులు భూమిపైకి వచ్చి వారి ఆశీర్వాదాలు ఇస్తారని నమ్ముతారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 10వ తేదీ నుండి పితృ పక్షాలు(పెత్తరమాస) ప్రారంభమవ్వనున్నాయి. ఆ మరుసటి రోజు నుంచే అశ్వినీ మాసం ప్రారంభమవుతుంది. అదే సమయంలో దసరా నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా పితృ పక్షాల చరిత్ర, ఆచారాలు, ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూ క్యాలెండర్ ప్రకారం పితృ పక్షం 2022 ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఈసారి భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ 10 సెప్టెంబర్ 2022. పితృ పక్షం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఇది 25 సెప్టెంబర్ 2022న ముగుస్తుంది.

పితృ పక్ష 2022 తేదీలు రెండవ శ్రాద్ధం – 11 సెప్టెంబర్, ఆదివారం

తృతీయ శ్రాద్ధ – 12 సెప్టెంబర్, సోమవారం

చతుర్థి శ్రాద్ధ – 13 సెప్టెంబర్, మంగళవారం

పంచమి శ్రాద్ధం – సెప్టెంబర్ 14, బుధవారం

షష్టి శ్రాద్ధ – 15 సెప్టెంబర్, గురువారం

సప్తమి శ్రాద్ధ – 16 సెప్టెంబర్, శుక్రవారం

అష్టమి శ్రాద్ధ – 18 సెప్టెంబర్, శనివారం

నవమి శ్రాద్ధ – 19 సెప్టెంబర్, ఆదివారం

దశమి శ్రాద్ధం – 20 సెప్టెంబర్, సోమవారం

ఏకాదశి శ్రాద్ధ – సెప్టెంబర్ 21, మంగళవారం

ద్వాదశి/సన్యాసిల శ్రాద్ధం – 22 సెప్టెంబర్, బుధవారం

త్రయోదశి శ్రాద్ధ – 23 సెప్టెంబర్, గురువారం

చతుర్దశి శ్రాద్ధ – 24 సెప్టెంబర్, శుక్రవారం

అమావాస్య శ్రాద్ధ, సర్వ పితృ అమావాస్య – 25 సెప్టెంబర్, శనివారం

పితృ పక్షం యొక్క ప్రాముఖ్యత- పితృ పక్షం అనగా శ్రాద్ధ సమయంలో పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించడం వలన వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పూర్వీకులకు తర్పణ నైవేద్యంగా పెట్టడం ద్వారానే మోక్షం లభిస్తుందని, వారి ఆశీస్సులు అందజేస్తారన్నారు. హిందూ గ్రంధాల ప్రకారం, పితృపక్షం సమయంలో, పూర్వీకులు భూమిపైకి వచ్చి మన చుట్టూ ఉంటారు. నియమానుసారంగా శ్రాద్ధం చేస్తే ఆ పూర్వీకులు మోక్షప్రాప్తి పొందుతారు.

పితృపక్షాలో ఏమి చేయాలి – ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. – పేదలకు, జంతువులకు ఆహారం ఇవ్వండి. -శ్రాద్ధ కర్మను నిర్వహించడానికి ముందు, సరైన సమయం, ప్రదేశం గురించి పూజారి నుండి సరైన మార్గదర్శకత్వం పొందండి. -పెద్ద కొడుకు ధోతి ధరించి, వట్టి ఛాతీతో కర్మ చేయాలి. పెద్ద కొడుకు బ్రతికి లేకుంటే, చిన్న కొడుకు లేదా మనుమడు లేదా భార్య చేయగలరు – కాకుల యమ దూతలుగా భావించి బియ్యం, నువ్వులతో కూడిన పిండ దానాన్ని ఇవ్వాలి.

పితృ పక్షం 2022: చేయకూడనివి – మద్యం, మాంసం, నల్ల ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయల వినియోగాన్ని ఖచ్చితంగా నివారించండి. -విలాసవంతమైన వస్తువులను కొనడం మానుకోండి. – ఏ శుభకార్యమూ నిర్వహించవద్దు. -ఇనుప పాత్రలను వాడటం మానుకోండి -ఈ కాలంలో వెండి లేదా ఇత్తడి పాత్రలను వాడండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం