Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో తిరుమల ఆలయం మూసివేత.. అన్ని రకాల దర్శనాలు బంద్..

భక్తులకు అలర్ట్.. తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయాన్ని అర్చకులు మూసేయనున్నారు. అక్టోబర్ 25 న సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తున్నట్లు...

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో తిరుమల ఆలయం మూసివేత.. అన్ని రకాల దర్శనాలు బంద్..
Tirumala
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 07, 2022 | 2:37 PM

భక్తులకు అలర్ట్.. తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయాన్ని అర్చకులు మూసేయనున్నారు. అక్టోబర్ 25 న సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. నవంబర్ 8 వ తేదీన చంద్రగ్రహణం ఉండటంతో ఆ రోజు కూడా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసేస్తారు. గ్రహణం వీడగానే ఆలయ శుద్ధి అనంతరం గుడిని తెరవనున్నారు. గ్రహణం కారణంగా ఈ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నీ రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం సర్వ దర్శనానికి మాత్రమే అనుమతిచ్చింది. భక్తులు ఈ మార్పులను గమనించాలని, ఈ సమాచారం ప్రకారం ప్రణాళికలు వేసుకుని దర్శనానికి రావాలని సూచించింది.

కాగా.. రెండేళ్ల విరామం తర్వాత ఈ సారి జరిగే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. అయితే.. గరుడసేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు తీసుకువచ్చే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ స్పష్టం చేసింది. మరోవైపు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌