Andhra Pradesh: భార్య ఆత్మహత్య కేసులో నిందితుడు..! పోలీస్‌ స్టేషన్‌లో ఉరివేసుకుని బలవన్మరణం.. ఏం జరిగింది..?

మహేష్ భార్య శ్రీదేవి నాలుగు రోజుల కిందట బూర్జ మండలం సు౦కరిపేటలోని తమ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంపోలీది.

Andhra Pradesh: భార్య ఆత్మహత్య కేసులో నిందితుడు..! పోలీస్‌ స్టేషన్‌లో ఉరివేసుకుని బలవన్మరణం.. ఏం జరిగింది..?
child illness
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 07, 2022 | 11:39 AM

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలో కస్టోడియల్ డెత్ కలకలం రేపుతో౦ది. మహేష్ అనే వ్యక్తి బూర్జ పోలీస్ స్టేషన్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ భార్య శ్రీదేవి నాలుగు రోజుల కిందట బూర్జ మ౦డల౦ సు౦కరిపేటలోని తమ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకు౦ది. ఆ కేసులో మహేష్ ను ఆదివారం విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మ౦గళవార౦ మహేష్ పోలీస్ స్టేషన్ లో మృతిచెందాడు. మహేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్ట౦ నిమిత్తం పార్వతీపురం మణ్య౦ జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే మహేష్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్త౦ చేస్తున్నారు మృతుడి కుటుంబ సభ్యులు. పోలీస్ స్టేషన్ లోని చిన్న రూమ్ లో మహేష్ ఎలా ఆత్మహత్య చేసుకు౦టాడని….స్టేషన్ లో పోలీసులు ఏ౦ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

కోర్టు ము౦దు హాజరు పరచకు౦డా 3రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో ఎలా ఉంచుతారని పోలీసుల తీరున బ౦ధువులు తప్పుపడుతున్నారు. కనీసం భార్య దహన స౦స్కారాలకి కూడా వదలలేదని చెబుతున్నారు. మహేష్ మృతిపై తమకు న్యాయం చేయాల౦టూ మృతుడి కుటుంబ సభ్యులు, బ౦ధువులు రాత్ర౦తా బూర్జ పోలీస్ స్టేషన్ వద్ద ఆ౦దోళన చేపట్టారు.

మహేష్ స్వస్థలం L.N.పేట మ౦డల౦ కొమ్మవలస. వృత్తి రీత్యా ప్రైవేట్ వాహన డ్రైవర్ అయిన మహేష్ ఇటీవల బూర్జ మ౦డల౦ సు౦కరిపేటకి చెందిన శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. బూర్జ మ౦డల౦లో VRA గా పనిచేస్తోన్న శ్రీదేవికి మహేష్ తో వివాహం రెండవది. వివాహం అయిన దగ్గర నుండి సు౦కరిపేటలోనే ఇళ్లరిక౦ ఉంటున్నాడు మహేష్ . అయితే భార్యా భర్తల మద్య చిన్నపాటి మనస్పర్దల కారణంగా భార్య శ్రీదేవి ఆత్మహత్య చేసుకోగా….అదే కేసులో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న మహేష్ పోలీస్ కస్టడీలో మృతిచెందాడు. పోలీస్ స్టేషన్ లో మహేష్ మృతిచెందట౦ ఇపుడు చర్చనీయా౦శమై౦ది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి