Video: లైవ్‌లో న్యూస్ చదువుతుండగానే యాంకర్‌కు స్ట్రోక్.. వైరల్ అవుతున్న వీడియో
గుండెపోటు చాలా ప్రమాదకరమైనది. ఈ పరిస్థితిలో సరిగ్గా గుర్తించబడకపోవడం లేదా సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువ.
Video: గత కొన్ని రోజులుగా గుండెపోటుకు సంబంధించిన చాలా లైవ్ వీడియోలు అనేకం చూస్తున్నాం..ఇందులో డ్యాన్స్ చేస్తూ, పాడుతూ ఎవరైనా గుండెపోటుకు గురైన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గుండెపోటు చాలా ప్రమాదకరమైనది. ఈ పరిస్థితిలో సరిగ్గా గుర్తించబడకపోవడం లేదా సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువ. స్ట్రోక్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ దాడి కూడా సంభవించే సమయంలో.. అకస్మాత్తుగా వచ్చి ప్రాణాంతకం కావచ్చు. స్ట్రోక్ ఎటాక్‌కి సంబంధించిన వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో లైవ్ షోలో ఓ న్యూస్ యాంకర్ స్ట్రోక్ బారినపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యాంకర్ స్వయంగా షేర్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.
నివేదిక ప్రకారం, అమెరికాలోని టుస్లా ఎన్బీసీ స్టేషన్‌లో జరిగింది. చంద్రుడి మీదకు అమెరికా పంపాల్సిన ఆర్టెమిస్ ప్రయోగం మరోసారి వాయిదా పడిందని తెలిసిందే..దీనికి సంబంధించిన వార్త చదువుతున్న సమయంలోనే యాంకర్ జూలీ చిన్‌లో స్ట్రోక్ లక్షణాలు కనిపించాయి. అదే ఛానెల్‌లో పనిచేసే మైక్ సింగ్‌టాన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
Tulsa news anchor Julie Chin has the beginnings of a stroke live on the air. She knew something was wrong, so tossed it to the meteorologist, as her concerned colleagues called 911. She’s fine now, but wanted to share her experience to educate viewers on stroke warning signs. pic.twitter.com/aWNPPbn1qf
— Mike Sington (@MikeSington) September 5, 2022
వీడియోలో… వార్తలు చదువుతున్న సమయంలో యాంకర్ నోట మాటలు రావడం కష్టంగా అనిపించింది. దాంతో తనకు ఏదో జరుగుతోందని అర్థం చేసుకున్న ఆమె.. వెంటనే తెలివిగా వాతావరణ వార్తలు విందాం అంటూ పక్కకు తప్పుకుంది. ఇదంతా గమనిస్తున్న సహోద్యోగులు అంబులెన్సులు పిలిచారు. తీరా చూస్తే ఆమెకు స్ట్రోక్ వచ్చిందని తేలింది. స్ట్రోక్ ప్రారంభ దశలోనే ఆస్పత్రికి తరలించడంతో ఆమె వెంటనే కోలుకుందని వైద్యులు చెప్పారు. జూలీ ప్రస్తుతం బాగానే ఉందని, అయితే స్ట్రోక్ వార్నింగ్ సైన్స్ గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి