viral video: మరీ ఇంత దారుణమా..? రూ.వెయ్యికోసం గర్భిణిని నడి రోడ్డుపై వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్!
రూ.వెయ్యి కోసం ఓ గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన నొప్పులతో బాధపడుతూ కనిపించింది.
viral video: ప్రస్తుత కాలంలో మనిషి మాయమైపోతున్నాడు.. మనుషుల్లోని మానవత్వం మంటగలిసింది..అని చెప్పే ఘటనలు ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం ప్రభుత్వ పనితీరునే విమర్శలపాలు చేస్తుంది. కాసుల కక్కుర్తితో ఓ అంబులెన్స్ డ్రైవర్ నీచానికి ఒడిగట్టాడు. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా.. కాసుల కోసం ఆమెను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన యూపీలో చోటు చేసుకుంది. రూ.వెయ్యి కోసం ఓ గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన నొప్పులతో బాధపడుతూ కనిపించింది. ఆమెను కుటుంబ సభ్యులు ఓదారుస్తున్నారు. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
यूपी में एंबुलेस कंपनी और उनके ड्राइवरों की बदमाशी कौन नहीं जानता।
ఇవి కూడా చదవండిये वीडियो हमीरपुर के पंधरी गांव का है। परिवार के पास देने के लिए 1000 नहीं थे इसलिए गर्भवती महिला को सड़क पर ही छोड़ दिया।
इतने निर्मम लोगों हैं कि क्या ही कहा जाए। pic.twitter.com/So8OKthLsP
— Rajesh Sahu (@askrajeshsahu) September 6, 2022
ఈ వీడియోను రాజేష్ సాహూ అనే జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా పండరి గ్రామంలో జరిగిందని వివరించారు.. కేవలం రూ. వెయ్యి ఇవ్వలేదని నిండు గర్బిణితోపాటు ఆమె బంధువులను అంబులెన్స్ డ్రైవర్ అడవిలో రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. అంబులెన్స్ డ్రైవర్ వెయ్యి రూపాయలు అడిగాడని, తమవద్ద లేవని చెప్పడంతో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లాడని గర్బిణి బంధువులు ఆరోపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబులెన్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి