Viral video: హైటెక్‌ రాజధానిని ముంచేసిన వరదలు.. రోడ్లపై తేలియాడుతూ కాంగ్రెస్‌ నాయకుడి వినూత్న నిరసన..

అత్యవసర పరిస్థితులను నిర్వహించగల సామర్థ్యం నగర పౌర సంస్థకు ఉందా అనే ప్రశ్నలను లేవనెత్తింది. మునుపెన్నడూ లేని విధంగా వర్షం, అక్రమ ఆక్రమణల కారణంగా..

Viral video: హైటెక్‌ రాజధానిని ముంచేసిన వరదలు.. రోడ్లపై తేలియాడుతూ కాంగ్రెస్‌ నాయకుడి వినూత్న నిరసన..
Karnataka Congress
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 06, 2022 | 8:23 PM

Viral video: బెంగళూరులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ నిలిచిపోయిన వరద నీటితో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బెంగళూరు నగర పౌర సంఘం, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల్లో, తుషార్ గిరినాథ్ భారతదేశ సిలికాన్ రాజధానిని ముంచెత్తిన ఆకస్మిక వరదలు పరిపాలన నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి. కుండపోత వర్షం బెంగళూరును రెండు నెలల్లో రెండోసారి అతలాకుతలం చేసింది, అత్యవసర పరిస్థితులను నిర్వహించగల సామర్థ్యం నగర పౌర సంస్థకు ఉందా అనే ప్రశ్నలను లేవనెత్తింది. మునుపెన్నడూ లేని విధంగా వర్షం, అక్రమ ఆక్రమణల కారణంగా ప్రాథమిక, తృతీయ మురికినీటి కాలువలు (SWD) మూసుకుపోయి, వరద నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

బెంగళూరులోని ప్రస్తుత పరిస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ (కేపీవైసీ) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ హరీస్ నలపాడ్ లో వినూత్న నిరసన చేపట్టారు. మంగళవారం నాడు గుంతలు తేలి, వర్షపు నీటితో నిండిపోయి అస్తవ్యస్థంగా మారిన రోడ్లపై ట్యూబ్‌ వేసుకుని ప్రయాణిస్తూ… నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ పరిపాలన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బెంగుళూరును సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలిచేవారని, బీజేపీ ప్రభుత్వం మునిగిపోయే నగరంగా మార్చిందని ఆరోపించారు. నగరం ఎదుర్కొంటున్న అన్ని విపత్తులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వారు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నారని నలపాడ్ విమర్శించారు.. అత్యంత ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు.. ఇళ్లు ముంపునకు గురైన వారితో మాట్లాడేందుకు కూడా పోలీసులు తమకు అనుమతించడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని అన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే నలపాడ్‌ ప్రత్యేక నిరసన చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విడుదల చేశారు. నలపాడ్ రోడ్డుపై వాన నీటిపై తేలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గత కాంగ్రెస్ ప్రభుత్వాలు సరస్సుల వద్ద భవనాలకు అనుమతులు ఇచ్చాయని బొమ్మై తప్పుబట్టారు . వరదల వల్ల నష్టపోయిన ప్రజల భద్రత కోసం మా అధికారులు 24 గంటలూ పనిచేస్తున్నారని అన్నారు.. మా ప్రభుత్వాన్ని నిందించే హక్కు కాంగ్రెస్‌కు లేదు. వారి ప్రభుత్వ హయాంలో సరస్సుల వద్ద ఉన్న ఈ భవనాలన్నీ పెరిగాయి. ఆ భవనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు’’ అని బొమ్మై తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి