Viral Video: యముడికి హాయ్ చెప్పి వచ్చాడు.. పట్టాలపై పడి అరగంట రైలు కిందే ఉన్నాడు.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో వైరల్
అలా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ..అతడు రైలు వెళ్లిపోగా, అమాంతం పైకి లేచాడు.. చెల్లాచెదురుగా పడిపోయిన తన వస్తువులను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు..
Viral Video :ఓ వ్యక్తి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చివరి క్షణంలో సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వేగంగా వెళ్తున్న రైలు పట్టాలపై కదలకుండా పడుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ప్లాట్‌ఫామ్, రైలు పట్టాలకు మధ్యలో ఇరుక్కుపోయిన అతడు బతికి బయటపడటం అక్కడున్న వారందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా భరత్నా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. అద్భుతంగా తప్పించుకున్న అతడు రైలు అతన్ని దాటి వేళ్లగానే.. ఏమైందన్నట్టుగా ప్లాట్‌ఫామ్ ఎక్కి వెళ్లిపోయాడు..వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆగ్రా భరతనా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నుండి ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరింది. ఎక్స్‌ప్రెస్ రైలు పూణె వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఉదయం 9.45 నిమిషాలకు ఓ వ్యక్తి చేతిలో సామాగ్రితో పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అంతలోనే రైలు వేగంగా దూసుకొచ్చింది. ఫ్లాట్‌ఫామ్ ఎక్కే వీలు లేకపోవటంతో అతడు.. చాకచక్యంగా వ్యవహరించాడు. వెంటనే ఫ్లాట్‌ఫామ్, రైలు పట్టాలకు మధ్యలో కదలకుండా పడుకుని ఉండిపోయాడు. కానీ, ఆ సీన్ చూసి అక్కడున్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది మాత్రం అతడు బ్రతికే అవకాశం లేదని భావించారు. చుట్టూ జనం భారీగా గుమిగూడారు..చాలా మంది అక్కడ జరిగిన సంఘటన అంతా తమ సెల్‌ఫోన్లతో వీడియోలో తీశారు.
అలా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ..అతడు రైలు వెళ్లిపోగా, అమాంతం పైకి లేచాడు.. చెల్లాచెదురుగా పడిపోయిన తన వస్తువులను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు..పోతూ పోతూ..తనకోసం ఎదురు చూసినవారందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
भरथना रेलवे स्टेशन पर आज सुबह 9 बजे भूरा सिंह नाम के यात्री जल्दबाजी के चलते ट्रैक पर गिर गए। इंटरसिटी ट्रेन उनके ऊपर से गुजर गई। खुशकिस्मत रहे बाल बांका नहीं हुआ। लेकिन इन घटनाओं में सबक ये है कि जिंदगी आपकी है ट्रेन की नहीं… pic.twitter.com/x9tGRzPfTI
— Ravish Ranjan Shukla (@ravishranjanshu) September 6, 2022
తొందరపాటు వల్లే ఇలా జరిగిందని, ప్రమాదమని గ్రహించి ఉంటే ఇంత టెన్షన్ ఉండేది కాదంటున్నారు. ఏది ఏమైనా అతడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి