Viral Video: వామ్మో లేడీ పోలీసా.. వీధి రౌడీనా.. అత్తమామలను చితక్కొట్టిన సబ్‌ ఇన్సెపెక్టర్‌

వీరావేశంతో అత్తమామలను నోటికి వచ్చినట్టుగా తిట్టిపోసింది. ఆ తర్వాత కోడలు మామపై దాడి చేసింది. పాపం పెద్దవారని కూడా చూడకుండా పదే పదే కొట్టింది. . దాడిలో

Viral Video: వామ్మో లేడీ పోలీసా.. వీధి రౌడీనా.. అత్తమామలను చితక్కొట్టిన సబ్‌ ఇన్సెపెక్టర్‌
Delhi Woman Cop
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 06, 2022 | 3:19 PM

Viral Video: వామ్మో.. లేడీ పోలీసా..లేదంటే వీధి రౌడీనా..అన్నట్టుగా విశ్వరూపం చూపించింది ఓ మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. ఆమెకు తోడుగా తన తల్లికూడా యువతి అత్తా మామలకు చుక్కలు చూపించింది. వృత్తి రీత్యా సబ్‌ ఇన్సెక్టర్ అయిన ఓ యువతి.. నడి వీడిలో రౌడీలా ప్రవర్తించింది. అందరూ చూస్తుండగానే తన మామను చితక్కొట్టుడు కొట్టింది. వీరావేశంతో లెంపలు వాయించింది. తన తల్లితో పాటు రెచ్చిపోయింది. వయస్సులో పెద్దవాడని కూడా చూడకుండా.. కొట్టింది. ఇదంతా అక్కడ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగినట్టుగా తెలిసింది. స్థానికంగా ఉంటున్న తన అత్తామామల ఇంటికి తన తల్లితో కలసి వెళ్లింది. తొలుత తల్లీకూతుళ్లు వారితో వాగ్వాదానికి దిగారు. వీరావేశంతో అత్తమామలను నోటికి వచ్చినట్టుగా తిట్టిపోసింది. ఆ తర్వాత కోడలు మామపై దాడి చేసింది. పాపం పెద్దవారని కూడా చూడకుండా పదే పదే కొట్టింది. . దాడిలో ఆమె తల్లి కూడా ఆమెకు సహాయం చేసింది. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే ఇదంతా మరో పోలీసు ఆఫీసర్ ఎదురుగానే జరిగింది. ఆయన వారించినా.. పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డారు.

ఇవి కూడా చదవండి

సదరు మహిళ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. తన అత్తమామలతో తనకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వారి మధ్య వివాదం కోర్టు వరకూ కూడా వెళ్లినట్టుగా తెలిసింది. వృద్ధులైన అత్తా మామల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, ఆ పోలీసు అధికారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి