Viral Video:నాన్నకు ప్రేమతో పెళ్లికూతురు, ఆమె సోదరి అంకితం చేసిన డ్యాన్స్‌.. ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేసింది..వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

తండ్రి-కూతుళ్ల బంధం అత్యంత అందమైన బంధమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రజలు ఈ అద్భుత డ్యాన్స్‌ని తెగ లైక్‌ చేస్తున్నారు. షేర్ చేసినప్పటి నుండి..

Viral Video:నాన్నకు ప్రేమతో పెళ్లికూతురు, ఆమె సోదరి అంకితం చేసిన డ్యాన్స్‌.. ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేసింది..వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Bride Her Sister's Dance
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 03, 2022 | 6:59 PM

Viral Video: పెళ్లి అంటే ఆ జోషే వేరు. ఆ సందడే వేరు. బంధుమిత్రులు ఫుల్ యాక్టివ్ గా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు సిగ్గు పడుతుంటే.. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో అవేవీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మిగతా వారి కంటే పెళ్లి కూతుళ్లే తెగ సందడి చేస్తున్నారు. వారి పెళ్లికి వారే సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. పెళ్లి అనగానే పెళ్లి కూతురి చీర గురించి చాలా మంది ముచ్చట్లు పెడుతుంటారు. కానీ ఇప్పుడు ఆమె చేసే డ్యాన్స్ గురించి మాట్లాడుకోవడం కామన్ అయిపోయింది.

పెళ్లంటేనే సందడి.. చుట్టాలు, పక్కాలతో ఆ ఇళ్లంతా ఫుల్‌ జోష్‌తో నిండిపోతుంది. వధూవరులను ఆటపట్టిస్తున్న స్నేహితులు, బందుమిత్రుల కోలాహలం నడుమ పెళ్లి సందడి మామూలుగా ఉండదు..ఇకపోతే, ఇటీవలి కాలంలో ప్రతి పెళ్లి వేడుకలోనూ డ్యాన్స్‌ అనేది పరిపాటిగా మారిపోయింది. అలాంటి ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది, ఇందులో ఒక వధువు, ఆమె సోదరి చేసిన డ్యాన్స్‌ని తమ తండ్రికి అంకితం చేశారు. ఈ వీడియో చూశాక తప్పకుండా మీ నాన్నను మిస్ అయ్యేలా చేస్తుంది. ఈ వీడియోలో, వధువు, ఆమె సోదరి తమ తండ్రికి నివాళిగా డ్యాన్స్‌ చేయడానికి వేదికపైకి వచ్చారు. అందమైన లెహంగాలు ధరించిన ఆ ఇద్దరు లేడీస్, ‘పాపా కెహ్తే హై’ ‘దిల్‌బరో’ పాటల్లో సముచితమైన వ్యక్తీకరణలు, సమన్వయంతో కూడిన స్టెప్పులతో అందంగా కనిపించారు. డ్యాన్స్ చూసి హాల్లో ఉన్న బంధువులంతా ఎమోషనల్ అయ్యారు. వీడియో చివర్లో, వధువు తండ్రి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.. తన కుమార్తెను గట్టిగా కౌగిలించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో navikproductionsandanavis1201 పేరుతో Instagram ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. వీడియోలోని టెక్స్ట్ “తన తండ్రికి వధువు నివాళి 600 మంది అతిథులను కంటతడి పెట్టించింది.” వీడియోకు క్యాప్షన్ ఇవ్వబడింది, ఈ వీడియో మిమ్మల్ని కూడా కదిలించినట్టయితే మరోమారు వీడియో క్లిక్‌ చేయండి..

తండ్రి-కూతుళ్ల బంధం అత్యంత అందమైన బంధమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రజలు ఈ అద్భుత డ్యాన్స్‌ని తెగ లైక్‌ చేస్తున్నారు. షేర్ చేసినప్పటి నుండి, వీడియో 43,858 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. కామెంట్ సెక్షన్‌లో హార్ట్‌, ఫైర్ ఎమోజీలలో కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.. “ఇది నిజంగా చాలా మధురమైన క్షణం అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి