Viral News: కుక్క పిల్లతో డాగ్ షో కి చిన్నారి.. రిక్వెస్ట్ చేయగా దగ్గరకొచ్చిన జడ్జ్.. తీరా చూస్తే ఫ్యూజుల్ ఔట్..

ఆమె కుక్కను చూసి అక్కడి న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారంతా షాక్ అయ్యారు.  వెంటనే వారు ఆ కుక్కపిల్ల దగ్గరకు

Viral News: కుక్క పిల్లతో డాగ్ షో కి చిన్నారి.. రిక్వెస్ట్ చేయగా దగ్గరకొచ్చిన జడ్జ్.. తీరా చూస్తే ఫ్యూజుల్ ఔట్..
Special Abled Girl
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 03, 2022 | 6:16 PM

Viral News: ఇక్కడ డాగ్ షో జరిగింది. ఒక చిన్న అమ్మాయి తన కుక్కను షోకు తీసుకువచ్చింది. ఆమె కుక్కను చూసి అక్కడి న్యాయమూర్తులు ఆశ్చర్యపోతున్నారు. వారు దానిని తాకి మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ అది ఎలా స్పందించలేదు..ఎందుకంటే..అది బొమ్మ కుక్క కాబట్టి. డాగ్ షోకి ఎవరైనా బొమ్మ కుక్కను తీసుకువస్తారా? కానీ ఈ అమ్మాయి తెచ్చింది. ఎందుకంటే అదే ఆమె పెంపుడు కుక్క. ఆమె దృష్టిలో అదే కుక్క. అవును, ఆమె ప్రత్యేకమైన అమ్మాయి. ఆ చిన్నారి ఆటిజమ్‌తో బాధపడతున్నట్టుగా తెలిసింది.. న్యాయమూర్తులు ఈ దృశ్యాన్ని హార్ట్‌ టచ్చింగ్‌గా తీసుకున్నారు. కుక్కను షోలో చూపించడానికి ఆమెకు అనుమతినిచ్చారు..దాంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

వెంటనే ఆమె తన బొమ్మ కుక్కపిల్లను పట్టుకుని రింగ్‌లో గిరగిరా తిరిగేసింది. ఆ తర్వాత సంతోషంతో అక్కడున్న న్యాయమూర్తిని హత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ దృశ్యం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఐదు లక్షల మందికి పైగా ఈ వీడియోని చూశారు.  స్పెషల్ చైల్డ్ ను ఇలా ప్రోత్సహించడం చూసి అక్కడున్న ప్రజలు కూడా చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు చేస్తూ..తమ ప్రేమను చాటుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి