New Education Policy: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మీ స్కూల్‌ బ్యాగ్‌ బారం తగ్గినట్టే..! స్కూల్ పాలసీ 2020 అమలు..

ఓ బ్యాగ్‌ నిండా బండెడు బుక్కులు, ఓ చేతిలో లంచ్‌ బ్యాగ్‌, మరో చేతిలో వాటర్‌ బాటిల్‌..ఆ పిల్లల పరిస్థితి చూస్తే..వాళ్లు వెళ్తుంది స్కూల్‌కేనా..? లేదంటే..కూలీలు చేసే బరువులు మోసే పనికానా..? అన్న సందేహం కలుగకమానదు..

New Education Policy: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మీ స్కూల్‌ బ్యాగ్‌ బారం తగ్గినట్టే..! స్కూల్ పాలసీ 2020 అమలు..
Education
Follow us

|

Updated on: Sep 03, 2022 | 4:15 PM

New Education Policy: ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోంది. ఇక స్కూల్‌కి వెళ్తున్న విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉదయం 7గంటలకే స్కూల్‌ ఫ్యాన్‌ హారన్‌తో మొదలవుతుంది పరుగు పందెం..వారిని మించి ఉన్న పుస్తకాల బరువుతో బడిబాట పట్టిన పిల్లలను చూస్తే నిజంగా జాలేస్తుంటుంది. ఎందుకంటే వీపు మీద ఓ బ్యాగ్‌ నిండా బండెడు బుక్కులు, ఓ చేతిలో లంచ్‌ బ్యాగ్‌, మరో చేతిలో వాటర్‌ బాటిల్‌..ఆ పిల్లల పరిస్థితి చూస్తే..వాళ్లు వెళ్తుంది స్కూల్‌కేనా..? లేదంటే..కూలీలు చేసే బరువులు మోసే పనికానా..? అన్న సందేహం కలుగకమానదు..ఈ క్రమంలోనే తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్కూల్‌ పిల్లల కష్టాలపై దృష్టి సారించింది. వివిధ తరగతుల విద్యార్థులు మోసే బ్యాగు బరువును తగ్గించాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్ సరికొత్త ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్రంలోని 1.30 లక్షల పాఠశాలల విద్యార్థులు వారానికి ఒక్కరోజు బ్యాగు తీసుకెళ్ల కుండానే స్కూల్‌కి వెళ్లేలా నిర్ణయం తీసుకుంది.

కొత్త ప్రతిపాదన ప్రకారం కంప్యూటర్ సైన్స్, మోరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, స్పోర్ట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, హెల్త్‌ అండ్‌ ఆర్ట్‌లను పాఠ్యాంశాలలో చేర్చాలి. ఈ సబ్జెక్టులను వారంలో ఒకరోజు బోధించాలి. స్కూల్ పాలసీ 2020, జాతీయ విద్యా పాలసీ ప్రకారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ లైట్‌వెయిట్ బ్యాగు పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. విద్యార్థుల తరగతులను బట్టి బ్యాగు బరువును నిర్దేశించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రతి పాఠశాలలోని నోటీసు బోర్డుపై ఉంచాలని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ పాలసీ వెంటనే అమలులోకి రావాలని, ప్రతి పాఠశాల దీనిని తూ.చా తప్పకుండా పాటించాలని అధికారికంగా వెల్లడించారు. అంతేకాకుండా వారంలో ఒకరోజు బ్యాగ్ లెస్ డేగా ఉంటుందని, ఆ రోజు విద్యార్థుల ఇతర కార్యకలాపాలపై నడుస్తుందని తెలిపారు. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన పుస్తకాలు మాత్రమే బ్యాగులో ఉండాలని, మరే ఇతర పుస్తకాలు బ్యాగులో స్కూల్‌కు తీసుకెళ్లకూడదని తెలిపారు.

ఈ సరికొత్త పాలసీ ప్రకారం.. 1, 2 తరగతుల విద్యార్థల బ్యాగులు 1.6-2.2 కిలోల బరువు ఉండాలన్నది ప్రతిపాదన. అదే విధంగా 3,4,5 తరగతుల విద్యార్థుల బ్యాగులు 1.7-2.5 కిలోలు ఉండాలే చూడాలి. 6,7 తరగతుల వారివి 2-3 కేజీలు, 8వ తరగతి వారు 4 కేజీలు, 9,10 తరగతుల వారి బ్యాగులు 2.5-4.5 కేజీల బరువు ఉండాలని ప్రభుత్వం సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి