Viral: పొత్తి కడుపులో ఉబ్బరం, నొప్పితో ఆస్పత్రికొచ్చిన మహిళ.. స్కాన్ చేసి ఖంగుతిన్న డాక్టర్లు..
గడిచిన నాలుగు నెలల నుంచి ఓ మహిళ పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, ఉబ్బరంతో బాధపడుతోంది. ఆ నొప్పిని తగ్గించుకునేందుకు..
గడిచిన నాలుగు నెలల నుంచి ఓ మహిళ పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, ఉబ్బరంతో బాధపడుతోంది. ఆ నొప్పిని తగ్గించుకునేందుకు ఆమె హెర్బల్ టీలు, హింగ్ వాటర్, వ్యాయామం, ప్రోబయోటిక్స్ వంటివి ఫాలో అయింది. కానీ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. వాటితో ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇక చేసేదేమిలేక ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడి డాక్టర్లు సదరు మహిళకు స్కానింగ్ నిర్వహించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూడగా.. ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకీ ఆ కథేంటంటే..
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన 48 ఏళ్ల మహిళ.. గడిచిన 4 నెలలుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. అంతేకాకుండా ఆమెను అప్పుడప్పుడూ కడుపు ఉబ్బరం బాధిస్తూ ఉండేది. ఈ నొప్పిని తగ్గించుకునేందుకు ఆమె కొన్ని వంటింటి చిట్కాలు పాటించింది. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. నొప్పి కాస్తా తీవ్రమైనది. ఇక చేసేదేమిలేక ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడున్న డాక్టర్లు ఆమెకు అల్ట్రాసోనోగ్రాఫీ స్కాన్ నిర్వహించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసి వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆమె గర్భాశయంలో ఫుట్‌బాల్ పరిమాణంలో ఉన్న పెద్ద కణితిని వైద్యులు గుర్తించారు.
కాగా, డాక్టర్లు సుమారు 2 గంటల పాటు శస్త్రచికిత్సను నిర్వహించి సుమారు 2.5 కేజీల బరువున్న ఆ కణితను బయటికి తీశారు. ఆ తర్వాత రోగిని 48 గంటల పాటు అబ్సర్వేషన్‌లో ఉంచి ఆపరేషన్ అయిన 3 రోజున డిశ్చార్జ్ చేశారు. పొత్తి కడుపులో అంత పెద్ద కణిత ఏర్పడినప్పటికీ.. సదరు మహిళ ఆరోగ్యంగానే ఉందని.. 30 ఏళ్ల అనంతరం మహిళలు సాధారణంగా కొన్ని చెకప్‌లు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.. ఈమె అవి చేయించుకోలేదని.. అజాగ్రత్త చేయడం వల్లే కణిత పెద్దగా పెరిగిందని డాక్టర్ రాజశ్రీ భాసలె తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..