Viral Video: భూకంప బీమాపై పార్లమెంటులో చర్చ.. అదే సమయంలో ఒక్కసారిగా కంపించిన భూమి

వైరల్‌ అవుతున్న వీడియోలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అక్కడి కెమెరాలు కూడా షేక్​ అయ్యాయి. ఆ నేత వెనకాల ఉన్న ఓ భవనంపై భూకంపం ప్రభావం పడింది.

Viral Video: భూకంప బీమాపై పార్లమెంటులో చర్చ.. అదే సమయంలో ఒక్కసారిగా కంపించిన భూమి
Liechtenstein
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 03, 2022 | 2:43 PM

Earthquake Insurance: ఆ దేశ పార్లమెంట్​లో.. భూకంప బీమాపై వాడివేడీగా చర్చ జరుగుతోంది. భూకంప బీమాపై పార్లమెంట్​ సభ్యులు ప్రసంగిస్తున్నారు. ఇంతలో భూమి ఒక్కసారిగా కంపించడంతో సభ్యులు ఆశ్చర్యానికి గురైయ్యారు.  భూకంపాలపై చర్చ జరుగుతున్నప్పుడే.. భూమికంపించడంతో ఆ చర్చ కాసేపు నిలిచిపోయింది. ఈ వ్యవహారమంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇది యూరోప్‌లోని ఓ చిన్న దేశమైన లిచెన్‌ స్టెయిన్‌లో చోటు చేసుకుంది. భూకంపాల బీమాపై ఆ దేశ పార్లమెంట్‌ చర్చ చేపట్టింది. కానీ, భూ ప్రకంపనల కారణంగా ఆ చర్చ నిలిచిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూరోప్​లోని ఆస్ట్రియా – స్విట్జ్​ర్లాండ్​ దేశాల మధ్యలో ఉంటుంది ఈ లిచెన్​స్టెయిన్​. ఆల్ప్స్​ పర్వతాల్లో అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఫలితంగా లిచెన్​స్టెయిన్​లో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో భూకంపాల పరిస్థితి, బీమా వంటి అంశాలపై లిచెన్​స్టెయిన్​ పార్లమెంట్​లో చర్చ జరిగింది. ఓ నేత ప్రసంగించడం మొదలుపెట్టారు. అప్పుడే తొలిసారి భూమికంపించింది. ఓ నవ్వు నవ్వేసి.. ఆమె ప్రసంగాన్ని మళ్లీ మొదలుపెట్టారు. అప్పుడు రెండోసారి మళ్లీ భూమి కంపించింది. పార్లమెంటు సమావేశంలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పార్లమెంట్‌లోని కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి

భూకంపం కారణంగా నాయకులు వెంటనే బయటకు వచ్చి సభను వాయిదా వేశారు. ఇప్పుడు, పశ్చిమ యూరోపియన్ దేశంలో అకస్మాత్తుగా ముగిసిన పార్లమెంటు సమావేశానికి సంబంధించిన చిన్న క్లిప్ ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అక్కడి కెమెరాలు కూడా షేక్​ అయ్యాయి. ఆ నేత వెనకాల ఉన్న ఓ భవనంపై భూకంపం ప్రభావం పడింది. అదంతా అక్కడి కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది.  ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్‌ నెట్‌లో వైరల్​గా మారటంతో నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.. ‘భూకంపం బీమాపై చర్చ జరుగుతుండగానే భూమి కంపించింది. చర్చ నిలిచిపోయింది, అంటూ ఓ నెటిజన్​ కామెంట్‌ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెఫ్ చెప్పిన ఈచిట్కాలను పాటిస్తే రోటీలుపువ్వులా మెత్తగా ఉబ్బుతాయ్
చెఫ్ చెప్పిన ఈచిట్కాలను పాటిస్తే రోటీలుపువ్వులా మెత్తగా ఉబ్బుతాయ్
ఆ ఇద్దరు మాజీ మంత్రులకు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకం..
ఆ ఇద్దరు మాజీ మంత్రులకు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకం..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 ఏళ్లుగా ఆ విషయంలో విఫలమవుతోన్న ధోని.. అదేంటంటే?
16 ఏళ్లుగా ఆ విషయంలో విఫలమవుతోన్న ధోని.. అదేంటంటే?
అడవుల్లో మండుతున్న మంటలు.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం..
అడవుల్లో మండుతున్న మంటలు.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే