Viral Video: లైవ్‌లో న్యూస్‌ యాంకర్‌ని ఇబ్బంది పెట్టిన ఈగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు…

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే 99k పైగా వ్యూస్‌ వచ్చాయి. వేల సంఖ్యలో లైక్‌లతో వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. హాస్యాస్పదమైన వీడియోకు ట్విట్టర్ వినియోగదారులు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

Viral Video: లైవ్‌లో న్యూస్‌ యాంకర్‌ని ఇబ్బంది పెట్టిన ఈగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు...
News Anchor
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 03, 2022 | 11:37 AM

Viral Video: న్యూస్ యాంకర్‌గా, గ్లామర్‌గా కనిపించడం తేలికైన పనిగా అనిపించవచ్చు. ఇకపోతే, టెలివిజన్ బులెటిన్ కోసం స్క్రిప్ట్‌ను చూసి చదవటం కూడా ఈజీనే అనుకోవచ్చు. కానీ, యాంకర్లు ఏదైనా బ్రేకింగ్ న్యూస్‌ని కవర్ చేయడానికి స్పాట్‌ న్యూస్‌ చెప్పడానికి వారు అవసరమైన సమాచారం, మాటలతో అప్పటికప్పుడు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. లైవ్‌ టెలివిజన్‌లో మిలియన్ల మంది ప్రజలు చూస్తుంటారు. కొన్నిసార్లు యాంకర్లు తడబడతారు. వారు లైవ్‌లో ఉన్నామనే సంగతి మర్చిపోతారు. ఇలాగో ఓ యాంకర్‌ లైవ్‌లో ఉండగా, ఆమెకు ఒక అసాధారణమైన సంఘటన ఎదురైంది. దాన్ని ఆమె ఏమాత్రం తడబడకుండా చాకచక్యంగా ఎదుక్కొని బులిటెన్‌ కంప్లీట్‌ చేసింది. కానీ, లైవ్‌లో ఆ యాంకర్ ఎదురైన ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

కెనడియన్ న్యూస్ ఛానెల్ గ్లోబల్ న్యూస్‌కి న్యూస్ యాంకర్ అయిన ఫరా నాసర్ అనే జర్నలిస్ట్ లైవ్‌ బులిటెన్‌ చదువుతోంది. పాకిస్థాన్‌లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆమె నివేదించారు. “పాకిస్థాన్ గతంలో ఎప్పుడూ ఇలాంటి భయానక వర్షాలు, వరదల్ని ఎదుర్కొలేదన్నారు. ఎనిమిది వారాలు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు పడ టంతో దేశంలో జాతీయ ఎమర్జెన్సీ విధించబడింది…” అంటూ నాజర్ తన వార్తా నివేదికలో చెప్పారు.

ఇవి కూడా చదవండి

హాట్‌హాట్‌గా ఆమె బ్రేకింగ్‌ న్యూస్‌ చదువుతున్న టైమ్‌లో ఆమెకు ఓ విచిత్ర ఘటన ఎదురైంది. వార్తలు చదువుతుండగా, ఆమె నోటికి అడ్డుగా ఓ ఈగ తగిలింది. అది గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఆమె నోట్లోకి వెళ్లింది. యాంకర్‌ అప్పుడు ఓ ఒక వాక్యం మధ్యలో ఉండగా ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఈగ మాత్రం ఆమెకు చుక్కలు చూపించింది. అయితే, బగ్ ఆమె నోట్లోకి వెళ్లగానే..ఆమె ఏమాత్రం ఆందోళన చెందలేదు.. వెంటనే ఈగను అమాంతంగా మింగేసింది. ఆ వెంటనే తను చదువుతున్న వాక్యాన్ని పూర్తి చేసి, నివేదికను కొనసాగిస్తుంది. ఆమె వీడియోను తన ట్వీట్ ఖాతాలో షేర్‌ చేసింది, “ఈ రోజుల్లో మనందరికీ నవ్వడం చాలా అవసరం కాబట్టే ఇలాంటి వీడియోని షేర్‌ చేశాను అంటూ ఫరా నాసర్‌ క్యాప్షన్‌ రాశారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే 99k పైగా వ్యూస్‌ వచ్చాయి. 1,600 లైక్‌లతో వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. హాస్యాస్పదమైన వీడియోకు ట్విట్టర్ వినియోగదారులు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. నెటిజన్లు ఈ క్షణాన్ని ఫన్నీగా తీసుకున్నప్పటికీ, వారు వృత్తిపరంగా పరిస్థితిని హ్యాండిల్ చేసినందుకు న్యూస్ యాంకర్‌ను కూడా ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి