AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GaneshChaturthi: సెక్యూరిటీ గార్డు అత్యుత్సాహం.. గణపతిని దర్శించుకోకుండానే వెళ్లిన బాలిక ఆత్మహత్య..

తల్లి రాసి ఉంచిన లేఖలో కూతురు గీసిన బొమ్మ కూడా ఉంది. ఇందులో క్యూలో నిల్చున్న భక్తులకు కూర్చుకోవటానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు చేయాలని కోరింది. గణపతి దర్శనం

GaneshChaturthi: సెక్యూరిటీ గార్డు అత్యుత్సాహం.. గణపతిని దర్శించుకోకుండానే వెళ్లిన బాలిక ఆత్మహత్య..
Lalbaugcha
Jyothi Gadda
|

Updated on: Sep 02, 2022 | 5:19 PM

Share

GaneshChaturthi: హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్సో.. ముంబయి వాసులకు ‘లాల్‌బాగ్చా రాజా’ గణపతీ అంతే ప్రత్యేకం..! ముంబయిలోని లాల్‌బాగ్చా రాజాను (గణపతి) చూసేందుకు ప్రతి సంవత్సరం భక్తులు భారీగా తరలి వస్తుంటారు. గణేశోత్సవాల సందర్భంగా భక్తులు దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి ఉంటుంది. లాల్‌బాగ్ రాజును చూసేందుకు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు,ప్రముఖులు కూడా క్యూ కడుతుంటారు. దర్శనం కోసం వచ్చే భక్తులు లాల్‌బాగ్ రాజా నవాస్‌పేటలో భక్తులు తమ కోర్కెలను లేఖ రాసి ఉంచుతారు. ఇందులో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ బాలిక తల్లి రాసిన లేఖ ప్రస్తుతం అందరినీ కలచి వేస్తుంది. వాషిలో నివసిస్తున్న ఈ మహిళా భక్తురాలు లాల్‌బాగ్ రాజుకు ఓ విన్నపం చేసింది.

వాషిలో నివసిస్తున్న ఓ మహిళ లాల్‌బాగ్ రాజుకు భావోద్వేగంతో లేఖ రాసింది. రెండేళ్ల క్రితం ఆ మహిళ కూతురు ఆత్మహత్య చేసుకుంది. 2019 లో ఆ అమ్మాయి, ఆమె తల్లి లాల్‌బాగ్చా రాజాను చూడటానికి వచ్చారు. వారిద్దరూ ఎనిమిది గంటల పాటు క్యూలో నిలబడ్డారు. ఇంతలో ఆ యువతి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగింది. దీంతో బాలిక దర్శనం చేసుకోకుండా తల్లితో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.. అదే రోజు బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

‘‘2019లో లాల్‌బాగ్ రాజా నవాసా క్యూలో నేను, నా కూతురు ఎనిమిది గంటల పాటు నిలబడ్డాం. కానీ క్యూ కదలలేదు. దీంతో ఆ బాలిక తీవ్రమైన కాళ్ల నొప్పులతో అవస్థ పడింది. కూతురి బాధ చూడలేక..ఆ తల్లి అక్కడి సెక్యూరిటీ గార్డుతో మాట్లాడేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అమ్మాయి మనసు నొచ్చుకునేలా, దుర్భాషలాడాడు సదరు సెక్యూరిటీ గార్డు..దాంతో తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురైంది. వెంటనే క్యూలైన్‌లోంచి బయటకు వచ్చేసి ఇంటికి వెళ్లిపోయారు. పదే పదే సెక్యూరిటీ గార్డు దూషించిన మాటలే గుర్తు చేసుకున్న ఆ బాలిక చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ ఆ తల్లి తన ఆవేదనను ఆ లేఖలోప్రస్తావించింది. లేఖలో ఓ చిత్రం కూడా కనిపించింది.

ఇవి కూడా చదవండి

తల్లి రాసి ఉంచిన లేఖలో కూతురు గీసిన బొమ్మ కూడా ఉంది. ఇందులో క్యూలో నిల్చున్న భక్తులకు కూర్చుకోవటానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు చేయాలని కోరింది. గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులకు క్యూలో కుర్చీలు వేయటం ద్వారా మరణించిన తన కూతురి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ లాల్‌బాగ్ రాజాకు ఆ తల్లి లేఖ రాసింది. ఈ ఫోటోను అమ్మాయి తీసిందని తల్లి ఈ లేఖలో పేర్కొంది. అలాగే, ఉత్తరం ప్రారంభంలో, కరోనా సంక్షోభం తర్వాత లాల్‌బాగ్ రాజు వస్తున్నాడని, కానీ అతనిని చూడాలని ఆశించిన నా కుమార్తె అజ్నా ఈ రోజు ఈ లోకంలో లేదని ఆ మహిళ బావోద్వేగాన్ని లేఖలో ప్రస్తావించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ