Mumbai: బంగారం, వెండితో తయారైన భారీ వినాయక విగ్రహం.. బరువు, ధర తెలిస్తే కళ్లు బైర్లే..!

కానీ ఇప్పుడు వినాయకుడి విగ్రహాల ఏర్పాటులోనూ భక్తులు, తయారీదారులు ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగానే వినాయకుడి విగ్రహాల తయారు చేసి భక్తులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.

Mumbai: బంగారం, వెండితో తయారైన భారీ వినాయక విగ్రహం.. బరువు, ధర తెలిస్తే కళ్లు బైర్లే..!
Lord Ganesh Idol
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2022 | 12:57 PM

Mumbai: గణేష్ నవరాత్రులు వచ్చాయంటే చాలు..వివిధ రూపాల్లో గణనాధుల విగ్రహలు భక్తులకు దర్శనమిస్తుంటాయి. అయితే, గతంలో వినాయక విగ్రహాలు దేవతా మూర్తులతో కలిసి ఉండేలా ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా ఆ లంబోధరుడి లక్షణాలు అందరికీ అర్థమయ్యేలా వినాయకుడి విగ్రహలు కొలువుదీరేవి. కానీ ఇప్పుడు వినాయకుడి విగ్రహాల ఏర్పాటులోనూ భక్తులు, తయారీదారులు ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగానే వినాయకుడి విగ్రహాల తయారు చేసి భక్తులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప, ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ అల్లూరి గెటప్పుల్లో విఘ్నేశుడి విగ్రహాలు భక్తులను ఆక్టటుకుంటున్నాయి. ముఖ్యంగా గణేశ్‌ ఉత్సవాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ముఖ్యంగా మహా రాష్ట్రలో గణేశ్‌ చతుర్థి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన గోల్డెన్‌ గణేశుడు దగదగలాడుతూ ఉత్సవాల్లో మరింత ఆకర్షణగా నిలుస్తున్నాడు.

Lord Ganesh

మ‌హారాష్ట్ర‌లోని ముంబై, పుణేలలో గ‌ణేశ్ చ‌తుర్ధి ఉత్స‌వాలను ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ముంబైలోని జీఎస్బీ సేవా మండ‌ల్ వ‌ద్ద ఏర్పాటు చేసిన వినాయ‌కుడు బంగారం, వెండితో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతున్నాడు. ఆ విఘ్నేశ్వ‌రుడి అలంక‌ర‌ణ కోసం 66 కిలోల బంగారాన్ని, 295 కిలోల వెండిని వాడారు. బంగారంతో వెలిగిపోతున్న ఆ గ‌ణేశుడిని చూసేందుకు భ‌క్తులు తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. భ‌క్తులు స‌మ‌ర్పించిన బంగారం, వెండితోనే వినాయ‌కుడిని డెక‌రేట్ చేసిన‌ట్లు జీఎస్బీ సేవా మండ‌ల్ ట్ర‌స్టీ అమిత్ పాయి తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి