AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turtle - Dog: కుక్కకి చుక్కలు చూపించిన తాబేలు.. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దంటున్న నెటిజనం..

Turtle – Dog: కుక్కకి చుక్కలు చూపించిన తాబేలు.. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దంటున్న నెటిజనం..

Anil kumar poka
|

Updated on: Sep 02, 2022 | 5:36 PM

Share

సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తే . మరి కొన్ని వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోల


సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తే . మరి కొన్ని వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోల గురించి చెప్పనే అక్కర్లేదు. వీటిని నెటిజన్లు బాగా ఇష్టపడతారు. తాజాగా ఓ కుక్క, తాబేలుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో నవ్వులు పూయిస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క తాబేలుతో స్నేహం చేయాలనుకుంది. సైలెంట్‌గా ఉన్న తాబేలు దగ్గరగా వెళ్లి తన నోటితో తాబేలును తాకింది. ఆ కుక్క తనను ఎక్కడ కరుస్తుందో అని భయపడిన తాబేలు ఒక్కసారిగా కుక్క నాలుకను గట్టిగా పట్టేసుకుంది. దాంతో కుక్కకు దడ పుట్టేసింది. ఈ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దంటారు పెద్దలు. ఈ వీడియో వీక్షిస్తున్న వేలాదిమంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇతరులను బలహీనులుగా భావిస్తే ఇలానే ఉంటుంది అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

 

Published on: Sep 02, 2022 05:36 PM