Telugu News Trending The relatives split into two factions and attacked them for not paying the wedding feast Telugu Viral News
Viral Video: అప్పడం కోసం తన్నుకున్న అతిథులు.. పెళ్లి విందులో కుర్చీలు, బల్లలతో విశ్వరూపం.. వీడియో వైరల్
పెళ్లంటే (Marriage) అతిథులు, బంధువుల సరదా సరదా సందడి మధ్య సాగే అపురూపమైన వేడుక. దూరంగా ఉంటున్న వారందరూ ఒకే చోటకు చేరే మహా ఘట్టం. అయితే వివాహ వేడుకల్లో ఎన్నో సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. ఇవి..
పెళ్లంటే (Marriage) అతిథులు, బంధువుల సరదా సరదా సందడి మధ్య సాగే అపురూపమైన వేడుక. దూరంగా ఉంటున్న వారందరూ ఒకే చోటకు చేరే మహా ఘట్టం. అయితే వివాహ వేడుకల్లో ఎన్నో సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. ఇవి పెళ్లిలోనే ప్రత్యేకంగా నిలిచిపోతాయి. పెళ్లిళ్లల్లో విందు భోజనాలు సాధారణమైన విషయమే కాకుండా అది తమ తాహతును తెలిపే విషయంగా పెళ్లి పెద్దలు భావిస్తుంటారు. మర్యాదలో ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని సార్లు విందు విషయంలో ఘర్షణలు తలెత్తుతాయి. అవి చినికి చినికి గాలి వానలా మారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ (Viral) అవుతోంది. పెళ్లికొచ్చి వధూవరులను ఆశీర్వదించి, విందు భోజనం చేసి వెళ్లాల్సిన అతిథులు బాహాబాహీకి దిగారు. భోజనంలో అప్పడం వడ్డించలేదని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అతిధులు రెండు వర్గాలుగా విడిపోయి గ్యాంగ్‌వార్‌ను తలపించేలా ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో లక్షన్నర విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి.
In the great 100% literate state of Kerala, a fist fight broke out at a wedding after friends of the bridegroom demanded papad during the feast. This triggered a verbal spat and ended up in an ugly brawl. No wonder Mallus belo papad. ? pic.twitter.com/HgkEUYMwfy
కేరళలోని అలప్పుజలోని ఓ వివాహ విందులో ఈ ఘటన జరిగింది. అప్పడం కోసం పెళ్లికొచ్చిన అతిథులు కుర్చీలు, బల్లలు విరిగేలా తన్నుకున్నారు. ఆగస్టు 28 మద్యాహ్నం ఈ ఘటన జరిగింది. పెళ్లి విందులో వరుడి స్నేహితుల్లో ఓ వ్యక్తి మరో అప్పడం వేయాలని సర్వర్‌ను కోరాడు. అందుకు అతను నిరాకరించాడు. దాంతో ఆ వ్యక్తి సర్వర్‌తో వాగ్వాదానికి దిగాడు. అదికాస్తా పెద్దదైంది. రెండు వర్గాలుగా విడిపోయి చైర్లు, టేబుల్స్‌తో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. అప్పడం చుట్టూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ హోరెత్తాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి