Shocking Video: ఒక్క అడుగు.. ప్రాణాలు కాపాడింది..! ఎలానో మీరే చూడండి.. షాకింగ్ వీడియో.
అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు కోతకు గురవుతున్నాయి. ఈక్రమంలో తాడిపత్రి యల్లనూరు మండలంలో
అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు కోతకు గురవుతున్నాయి. ఈక్రమంలో తాడిపత్రి యల్లనూరు మండలంలో చిత్రావతి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మండల పరిధిలోని సింగవరం గ్రామం వద్ద చిత్రావతి నది మీద రోడ్డు కోతకు గురైంది. అయినా వాహనదారులు అదే రోడ్డుపై రాకపోకలు జరపాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఓ మహిళ రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. భారీ గుంత ఏర్పడింది. ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ మహిళ గుంతలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయేది. ఆ మహిళ అడుగుతీయగానే రోడ్డు కుంగిపోయింది. అక్కడే ఉన్న ఇతర వ్యక్తులు వెంటనే అప్రమత్తమై ఆ మహిళకు చేయందించారు. మహిళ తృటిలో ప్రాణాలతో బయటపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Pawan Kalyan: వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).
Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)