Viral Video చెల్లెలు కోసం అన్న ఆరాటం.. రెప్పపాటులో భలేగా రక్షించాడుగా.. చిన్నోడి తెలివికి వావ్ అనాల్సిందే..
కానీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలోని ఓ చిన్నొడు చేసిన పని చేస్తే వావ్ అంటారు. ఆ బుజ్జాయి తెలికి మీ మనసులు సైతం కరిగిపోతాయి. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేశాడో తెలుసుకుందామా.
సాధారణంగా చిన్న పిల్లలు చేసే అల్లరి పనులు చూస్తే భలే నవ్వొస్తుంది. కొన్నిసార్లు వాళ్లు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఎన్నో వీడియోస్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలోని ఓ చిన్నొడు చేసిన పని చేస్తే వావ్ అంటారు. ఆ బుజ్జాయి తెలికి మీ మనసులు సైతం కరిగిపోతాయి. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేశాడో తెలుసుకుందామా.
అందులో ఓ చిన్నోడు సోఫాలో కూర్చుని ఉండగా.. పక్కనే అతడి చెల్లి ఆడుకుంటుంది. కాసేపటికి ఆ పాప కింద పడిపోతుండగా.. గమనించిన ఆ చిన్నోడు వెంటనే తన చెల్లిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. చివరకు తన టీషర్ట్ పట్టుకుని నెమ్మదిగా నేలపై వదిలిపెట్టాడు. అనంతరం తన చెల్లి తలకు గాయమైందంటూ పక్కనున్నవారికి చెబుతూ.. తన తల నిమిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కుర్రాడి తెలివికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్.
This little boy quickly saved his baby sister from falling off the couch.. ? pic.twitter.com/nu2DIV5Pgm
— Buitengebieden (@buitengebieden) September 1, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.