Sidharth Shukla: నీ గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది.. నీ రూపం మా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది..

అతి తక్కువ సమయంలోనే సినీ ప్రపంచంలో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ.. ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని వదిలివెళ్లారు. గతేడాది సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించారు సిద్ధార్థ్.

Sidharth Shukla: నీ గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది.. నీ రూపం మా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది..
Siddarth
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 02, 2022 | 12:02 PM

బుల్లితెర సూపర్ స్టార్ దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా (Sidharth Shukla) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై అలరించే అగ్ర హీరోలతోపాటు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక టెలివిజన్ స్టార్. యూత్‏లో సిద్ధూ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. బాలికా వధూ (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‏లో శివ పాత్రతో ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు సిద్దూ. ఇక బిగ్‏బాస్ సీజన్ 13 విజేతగా నిలిచి.. ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. షోలో సిద్దూ యాటిట్యూడ్, బోల్డ్ స్టైల్‏తో యూత్‏లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సిద్ధార్థ్, షెహనాజ్ గిల్ మధ్య స్నేహం ఆడియన్స్‏ను ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే సినీ ప్రపంచంలో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ.. ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని వదిలివెళ్లారు. గతేడాది సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించారు సిద్ధార్థ్. తమ అభిమాన నటుడి అకాల మరణం అభిమనుల గుండెంల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. సిద్ధూ అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలివచ్చారు. బుల్లితెరపై మరే నటుడికి లేనంత క్రేజ్ సంపాదించుకున్న సిద్ధూ ఈ ప్రపంచానికి దూరమై నేటికి ఏడాది. అతడి మొదటి వర్దంతి సందర్భంగా సిద్ధూకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సిద్ధార్థ్ శుక్లా మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. వి మిస్ యూ సిద్ధూ.. సిద్ధార్థ్ శుక్లా లైవ్స్ ఆన్, షెహనాజ్ ఫరేవర్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

1980 డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ శుక్లా.. వ్యాపారవేత్త కావాలని కలలు కనేవాడు. కానీ అతని తల్లి కోరికతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2004లో మోడలింగ్ పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. ఆ తర్వాత 2008లో టర్కీలో జరిగిన ప్రపంచంలోనే అతి పెద్ద మోడలింగ్ షోలో గెలిచి దేశం గర్వపడే పేరు తెచ్చుకున్నారు.ఈ షో తర్వాత సిద్ధూకు ఇండస్ట్రీలో ఎన్నో ఆఫర్లు తలుపు తట్టాయి. అనేక ప్రకటనలలో నటించారు. ఆ తర్వాత బాబుల్ కా ఆంగన్ ఛోటే నా అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 2012లో ప్రసారమైన బాలికా వధు సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ సీరియల్ అతని కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ తర్వాత దిల్ సే దిల్ తక్ సీరియల్‏లోనూ నటించి మెప్పించాడు. టీవీ సీరియల్స్ మాత్రమే కాకుండా రియాల్టీ షోలలోనూ పాల్గోన్నాడు. ఝలక్ దిఖ్లా జా, డాన్స్ దీవానే వంటి రియాల్టీ షోలలో కనిపించాడు. బిగ్ బాస్ సీజన్ 13లో ఎంట్రీ ఇచ్చి..యాటిట్యూడ్‏తో యూత్‏లో ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ షో ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుని బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా నిలిచాడు. 2014లో వరుణ్ ధావన్, అలియా భట్ కలిసి నటించిన హంప్టీ శర్మాకి దుల్హనియా చిత్రంలో నటించారు. వరుస ఆఫర్లతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఆకస్మాత్తుగా గుండెపోటుతో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లారు సిద్ధూ.

ముక్కలైన ప్రతి ఒక్కరి గుండెలోని ప్రతి అంగుళం నీకోసం విలపిస్తుంది సిద్ధార్థ్. ప్రస్తుతం నువ్వు సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాము.. మిమ్మల్ని ప్రతిరోజూ మేము మిస్ అవుతున్నాము.. మిమ్మల్ని చూడకుండానే ఒక సంవత్సరం గడిచింది. కానీ మీరు ఎప్పటికీ మా హృదయాలలో ఉన్నారు అంటూ ట్వీట్ చేస్తున్నారు సిద్ధార్థ్ అభిమానులు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి