Viral News: అర్జంట్ పనిమీద వెళ్లాను..కాసేపు ఆగండి !.. వైరలవుతున్న రైల్వే టికెట్ ఆపరేటర్ సైన్ బోర్డ్..
ఆ సమయంలోకూడా అతను ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. కౌంటర్ ముందు ఓ బోర్డు పెట్టి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రకృతి పిలిస్తే ఎవరైనా వెళ్లాల్సిందే. మల, మూత్రాలను ఆపుకోవడం ఎవరికైనా కష్టమే. కౌంటర్‌లో కూర్చొని టికెట్ ఇస్తున్న ఆపరేటర్‌కు సడెన్‌గా ప్రకృతినుంచి పిలుపొచ్చింది. అయితే, అతడు నన్నెవరు అడుగుతారులే అని నిర్లక్ష్యంగా అక్కడ్నుంచి లేచి వెళ్లిపోలేదు. ఆ సమయంలోకూడా అతను ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. కౌంటర్ ముందు ఓ బోర్డు పెట్టి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పాట్నాలోని రైల్వే స్టేషన్‌లో టికెట్ ఆపరేటర్‌కు అర్జెంట్‌గా బాత్‌రూంకి వెళ్లాల్సి వచ్చింది. అందుకు అతను టికెట్ కోసం వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఓ బోర్డు రాసి తన కౌంటర్ ముందు ఉంచి వెళ్లాడు. ఆ బోర్డుపైన ‘బాత్‌రూం నుంచి వస్తున్నా.. కాసేపు వేచిచూడండి..’ అని రాశాడు. ఈ సైన్‌బోర్డును వీడియో తీసి ఓ యూజర్ తన ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ నోట్‌ను చూసిన వారందరూ నవ్వాపుకోలేకపోతున్నారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా.. వేలల్లో లైక్ చేశారు. అంతేకాదు వందలమంది వీడియోను తమదైన శైలిలో కామెంట్ చేస్తూ షేర్ చేశారు.
Patna Junction ??? pic.twitter.com/T8MOLR3APJ
— Aye Himanसू ® (@4mlvodka) August 30, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.