AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jackpot: 10 కోట్ల లాటరీ గెలిచారు.. ఆచూకీ లేకుండా పోయారు.. ఏం జరిగిందంటే..(వీడియో)

Jackpot: 10 కోట్ల లాటరీ గెలిచారు.. ఆచూకీ లేకుండా పోయారు.. ఏం జరిగిందంటే..(వీడియో)

Anil kumar poka
|

Updated on: Sep 02, 2022 | 8:07 PM

Share

ప్రతి మనిషినీ అదృష్టం అనేది ఎప్పుడో అప్పుడు ఏదో రూపంలో పలకరిస్తుంది. కాకపోతే దానిని గుర్తించినవారు నిజమైన అదృష్టవంతులవుతారు.. సాధారణంగా లాటరీలో ఏ చిన్న బహుమతి గెలిచినా


ప్రతి మనిషినీ అదృష్టం అనేది ఎప్పుడో అప్పుడు ఏదో రూపంలో పలకరిస్తుంది. కాకపోతే దానిని గుర్తించినవారు నిజమైన అదృష్టవంతులవుతారు.. సాధారణంగా లాటరీలో ఏ చిన్న బహుమతి గెలిచినా చాలా ఆనందంగా ఫీలవుతారు. లాటరీ టికెట్‌ కొన్నదగ్గరినుంచి అలాంటి క్షణం కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. అలాంటిది ఓ వ్యక్తి లాటరీలో కోట్ల నగదు గెలుచుకుని దానిని పొందే అదృష్టానికి నోచుకోలేదు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో మెగా మిలియన్స్ లాటరీ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో జులై 29న 134 కోట్ల డాలర్ల విలువైన లాటరీ డ్రా తీశారు. ఇందులో ఓ వ్యక్తి ఏకంగా 10,716.18 కోట్లు గెలుచుకున్నాడు. బహుమతి గెలుచుకున్న లాటరీ టికెట్ల నంబర్లను ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసినవారు లాటరీ నిర్వాహకులను సంప్రదించలేదు. దాంతో విజేతలు తమను సంప్రదించాలంటూ ఇల్లినాయిస్ లాటరీ డైరెక్టర్ హరోల్డ్ మేస్ ప్రకటించారు. ఈ లాటరీ గెలుచుకున్న నంబర్ల సిరీస్ 13, 36, 45, 57, 67, 14 అని.. చికాగో నగర శివార్లలోని ఓ పెట్రోల్ బంక్ లో ఈ లాటరీ టికెట్ అమ్ముడైందని తెలిపారు. సాధారణంగా అమెరికాలో ఏ లాటరీకైనా విజేతలు బహుమతిని క్లెయిమ్ చేసుకోవడానికి రెండు నెలల వరకు మాత్రమే సమయం ఉంటుంది. అయితే మెగా మిలియన్ లాటరీకి మాత్రం 180 రోజులు గడువు ఉంటుంది. ఈ క్రమంలో నెల రోజులు అవుతున్నా.. లాటరీ గెలుచుకున్నవారు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో విజేతలు త్వరగా ముందుకు రావాలంటూ ఆ కంపెనీ ప్రకటన కూడా జారీ చేయాల్సి వచ్చింది. మరో విశేషం ఏమిటంటే.. అమెరికా చరిత్రలోనే అత్యంత విలువైన లాటరీల్లో ఇది మూడోది కావడం గమనార్హం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 02, 2022 08:07 PM