AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చమురు రవాణాకు “ఉత్తర ధ్రువ” మార్గం .. ప్రపంచానికి గుడ్‌న్యూస్?

హర్ముజ్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చైనా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రష్యా వెంబడి ఉత్తర ధ్రువ సముద్రం గుండా వెళ్లే 5,600 కిలోమీటర్ల మార్గం ప్రపంచ వాణిజ్య సమీకరణాలనే మార్చనుంది. సూయజ్ కాలువ రవాణాతో పోలిస్తే 'పోలార్ సిల్క్ రోడ్' ప్రయాణ సమయాన్ని 10 నుండి 12 రోజుల వరకు తగ్గించనుంది.

చమురు రవాణాకు ఉత్తర ధ్రువ'' మార్గం .. ప్రపంచానికి గుడ్‌న్యూస్?
Arctic Shipping Route Is The New Alternate To Hormuz
Sharada V
|

Updated on: Aug 17, 2026 | 4:09 PM

Share

హర్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి, చమురు రవాణాకు అత్యంత కీలకం. అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం తీవ్ర ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఒక వైపు చమురు ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తవుల ధరలు కూడా పెరిగి సామాన్యుడికి భారంగా మారాయి. హర్ముజ్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చైనా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రష్యా వెంబడి ఉత్తర ధ్రువం గుండా వెళ్లే 5,600 కిలోమీటర్ల సముద్ర మార్గం, ప్రపంచ వాణిజ్య సమీకరణాలనే మార్చనుంది. సూయజ్ కాలువ రవాణాతో పోలిస్తే ‘పోలార్ సిల్క్ రోడ్’ ప్రయాణ సమయాన్ని 10 నుండి 12 రోజులు తగ్గించడమే కాకుండా ఇంధన ఖర్చులు, రవాణా భారాన్ని ఆదా చేయనుంది.

మధ్యప్రాచ్యంలో ఎర్ర సముద్రం, హర్ముజ్, సూయెజ్ కాలువ రవాణా  ఇక గతం కాబోతోందా? ఇరాన్ అమెరికా ఘర్షణ, హౌతీలు, సోమాలియా సముద్ర దొంగల నుంచి తప్పుకునేలా చేసే మంచు మార్గం చైనాకు వ్యూహాత్మకంగా మారనుంది.: వాతావరణ మార్పుల వల్ల ఆర్క్‌టిక్‌ ప్రాంతంలో మంచు త్వరగా కరుగుతుండటం, మంచును చీల్చుకుని వెళ్లే అధునాతన ఐస్-బ్రేకర్ నౌకల వినియోగం పెరగడంతో ఈ మార్గంలో ఏడాదంతా నౌకల రాకపోకలను కొనసాగించవచ్చు.

రష్యా ఉత్తర తీరం వెంబడి దాదాపు 5,600 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆర్క్‌టిక్ మార్గం, తూర్పు ఆసియాను యూరప్‌తో అనుసంధానించే సముద్ర మార్గం. సూయజ్ కాలువ లేదా ఆఫ్రికాను చుట్టి వెళ్లే ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మార్గాల్లో యూరప్‌ చేరడానికి 40 నుంచి 50 రోజులు పడుతుంది. కానీ ఆర్క్‌టిక్ మార్గంలో కేవలం 18 నుంచి 20 రోజుల్లోనే చైనా నుండి యూరప్ చేరుకోవచ్చు! ప్రయాణ సమయం సగానికి సగం తగ్గడంతో, కంటైనర్ నౌకలకు కోట్లాది రూపాయల ఇంధన వ్యయం, ఆపరేషనల్ ఖర్చులు ఆదా అవుతాయి. ఒకప్పుడు సాధ్యపడదు అనుకున్న ఆర్క్‌టిక్‌ మార్గంలో రవాణా ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్‌కు సరికొత్త జీవనాడిగా మారనుంది!

భారత్ ట్రయల్ రన్ ఎప్పుడంటే!

భారత్ కూడా ఆర్క్‌టిక్ షిప్పింగ్ రూట్ పట్ల ఆసక్తిని కనబరిచింది. ఇంధన భద్రతకు భారత్ కు ఈ మార్గం వ్యూహాత్మకంగా మారనుంది. రష్యాలో లభించే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువును (LNG) భారత్‌ దిగుమతి చేసుకోవచ్చు. మధ్యప్రాచ్యంలో సంక్షోభాలు తలెత్తినప్పుడు సూయజ్ కాలువ, హర్ముజ్‌ పై ఆధారపడకుండా, ఐరోపా దేశాలకు భారతీయ ఉత్పత్తులను వేగంగా ఎగుమతి చేయడానికి ఇది అనువైన మార్గం కానుంది. ఆర్క్‌టిక్‌ సముద్ర మార్గం సాధ్యసాధ్యాలను అంచనా వేసేందుకు 2027లో భారత్ తన తొలి సరుకు రవాణా నౌకను పంపేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. భవిష్యత్తు సముద్ర వాణిజ్యంలో తన సార్వభౌమత్వాన్ని చాటుకునేందుకు భారత్ కు ఇది కీలక ముందడుగు కానుంది.

Follow Us