AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Pappu: టమాటా పప్పు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి.. అన్నంలోకి కమ్మగా నెయ్యితో తింటే స్వర్గమే!

ప్రతి తెలుగువారి ఇంట్లో వారంలో కనీసం రెండు మూడు సార్లయినా తప్పనిసరిగా చేసుకునే వంటకం టమాటా పప్పు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, పక్కన ఏదైనా వేపుడు లేదా ఆవకాయ నంజుకుని తింటే ఆ తృప్తే వేరు. అయితే పప్పు, టమాటాలను నేరుగా ఉడికించి చివరగా తాలింపు పెట్టే పద్ధతి అందరికీ తెలిసిందే. అలా కాకుండా ముందే కుక్కర్‌లో కమ్మని పోపు వేసి, టమాటాలు, మసాలాలు మగ్గించి వండితే పప్పు రుచి అద్భుతంగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా నిమిషాల్లో చేసుకునే ఈ సులువైన రెసిపీని ఇప్పుడు చూద్దాం.

Phani CH
|

Updated on: Aug 17, 2026 | 3:55 PM

Share
కావలసిన పదార్థాలు: 200 గ్రాముల కందిపప్పు, పావు కేజీ టమాటాలు, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, మూడు ఎండుమిర్చి, ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, పావు టీస్పూన్ ఇంగువ, కరివేపాకు, పసుపు, కారం, రెండు టేబుల్ స్పూన్ల చింతపండు రసం, ఉప్పు, నూనె మరియు కొత్తిమీర.

1 / 5
తయారీ విధానం: ముందుగా కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు త్వరగా, మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత చిటికెడు మెంతులు వేసి ఎర్రగా వేయించాలి.

2 / 5
మెంతులు వేయడం వల్ల పప్పుకు మంచి సువాసన వస్తుంది. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, చిటికెడు ఇంగువ వేసి దోరగా వేయించాలి. అనంతరం నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేపాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి నూనెలో మగ్గనివ్వాలి.

3 / 5
టమాటాలు కాస్త వేగాక అర టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల కారం, తగినంత ఉప్పు మరియు రెండు స్పూన్ల చింతపండు రసం వేసి బాగా కలపాలి. టమాటా పులుపుకు తగినట్లుగా కారం సరిచూసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును నీళ్లతో సహా ఇందులో వేయాలి. పప్పు తీసుకున్న కప్పుతోనే మొత్తం నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. ఉప్పు సరిచూసుకుని కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై నాలుగు విజిల్స్ రానివ్వాలి.

4 / 5
ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి పప్పును గరిటతో లేదా పప్పుగుత్తితో కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి. మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా అక్కడక్కడా పప్పు పలుకులు తగులుతుంటేనే టమాటా పప్పు చాలా బాగుంటుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే టమాటా పప్పు సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి!

5 / 5
Follow Us
DMartలో ఈ 5 వస్తువులు కొనేముందు ఆలోచించండి.. ఈ టిప్స్‌ పాటించండి!

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్

మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!

జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి

సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..

భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం

మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..

రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..

కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి

అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!