Covid Vaccine: బిల్ గేట్స్, అదార్ పూనావాలాకు బాంబే హైకోర్టు నోటీసులు..కూతురి మరణంపై కోర్టును ఆశ్రయించిన తండ్రి..!

డా. స్నేహల్ జనవరి 28, 2021న కాలేజీలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కానీ,..

Covid Vaccine: బిల్ గేట్స్, అదార్ పూనావాలాకు బాంబే హైకోర్టు నోటీసులు..కూతురి మరణంపై కోర్టును ఆశ్రయించిన తండ్రి..!
Covid Vaccine
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2022 | 4:45 PM

Covid Vaccine: గత రెండేళ్లలో కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సంక్షోభంలో పడ్డాయి. ఇప్పుడు కరోనా (కోవిడ్ -19) సంక్షోభం కాస్త తగ్గుముఖం పడుతోంది. కరోనా కాలంలో లక్షలాది మంది చనిపోయారు. కరోనా వ్యాక్సిన్ కారణంగా, చాలా మంది ప్రజలు ప్రాణాపాయం తప్పి సురక్షితంగా రక్షించబడ్డాయి. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే ఓ యువతి చనిపోయిందని ఆమె తండ్రి ఆరోపించారు.. ఈ విషయమై నేరుగా ముంబై హైకోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హైకోర్టు ఇప్పుడు బిల్ గేట్స్, సిరామ్‌కు చెందిన అదార్ పూనావల్లకు నోటీసులు జారీ చేసింది . రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

డా. స్నేహల్ లునావత్ మృతి కేసులో అతని తండ్రి దిలీప్ లునావత్ బాంబే హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నేరుగా బిల్ గేట్స్, ఆధార్ పూనావాలా, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వల్లే తన కూతురు చనిపోయిందని దిలీప్ లునావత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సిరామ్‌కు 1000 కోట్లు పరిహారం చెల్లించాలని ఆయన ఈ పిటిషన్ ద్వారా డిమాండ్ చేశారు.

కాగా, దిలీప్ లునావత్ కుమార్తె డా. స్నేహల్ లూనావత్ నాసిక్‌లో మెడిసిన్ చదువుతోంది. కరోనా సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది, ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించదు అని ప్రకటించారు. డా. స్నేహల్ జనవరి 28, 2021న కాలేజీలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కానీ, చివరకు మార్చి నెలలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ సిరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తప్పిదాల వల్లే తన కుమార్తె మృతి చెందిందని దిలీప్‌ లునావత్‌ ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..