Uttarakhand: ప్రియురాలు, ఆమె తల్లిని నరికి చంపేసిన ప్రియుడు..జంట హత్యలతో ఉలిక్కిపడ్డ స్థానికులు.. కారణం ఏంటంటే..?

పట్టపగలే జరిగిన జంట హత్యలతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. హత్య చేసిన తర్వాత, నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి లొంగిపోయాడు. హత్యకు

Uttarakhand: ప్రియురాలు, ఆమె తల్లిని నరికి చంపేసిన ప్రియుడు..జంట హత్యలతో ఉలిక్కిపడ్డ స్థానికులు.. కారణం ఏంటంటే..?
Crime News
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2022 | 3:20 PM

Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలికి మరోరకరితో సంబంధం ఉందనే కోపంతో ప్రియురాలితోపాటు ఆమె తల్లిని కూడా అతి దారుణంగా హతమార్చాడో ప్రేమోన్మాది.. పట్టపగలే జరిగిన జంట హత్యలతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. హత్య చేసిన తర్వాత, నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి లొంగిపోయాడు. హత్యకు వాడిన ఆయుధం చేతిలో పట్టుకుని, తన ప్రియురాలిని, ఆమె తల్లిని చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాశీపూర్‌లోని మొహల్లా అల్లీ ఖాన్ ఇమ్లీ చౌక్‌లో రయీస్ తన భార్య షబానా, కూతురు శివ, కొడుకు షాబేజ్‌లతో కలిసి నివసిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా దుబాయ్‌లో ఫర్నీచర్ పనులు చేస్తూ నివసిస్తున్నారు. అదే సమయంలో నిందితుడు సల్మాన్ కూడా మొహల్లా అలీ ఖాన్‌లోనే నివసిస్తున్నాడు. గత ఏడాది కాలంగా సౌదీ అరేబియాలో ప్లంబర్‌గా పనిచేసేవాడు. ఇదిలా ఉంటే, నిందితుడు సల్మాన్ నెలరోజుల క్రితం..సౌదీ అరేబియా నుంచి కాశీపూర్‌లోని తన ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే సల్మాన్, శివ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సల్మాన్ సౌదీ అరేబియా వెళ్లడానికి ముందు శివతో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇద్దరూ కలిసి జీవించాలని ఆశపడ్డారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన తర్వాత సల్మాన్ తన గర్ల్‌ఫ్రెండ్ శివను పెళ్లి చేసుకోవాలని కోరాడు, కానీ శివ పెళ్లికి అంగీకరించలేదు.. ఈలోగా, మరోకరితో ఆమెకు సంబంధం ఉందని, అతన్నే ఆమె పెళ్లి చేసుకోబోతుందని సల్మాన్‌కు తెలిసింది.

తను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు, మరోకరితో పెళ్లికి సిద్ధపడిందని తెలిసి సల్మాన్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. కట్టలు తెగిన ఆవేశంలో వెంటనే ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెను హత్య చేశాడు. అడ్డువచ్చిన ఆమె తల్లి కూడా అతి దారుణంగా నరికి చంపేశాడు. అనంతరం నేరుగా పోలీస్‌ స్టేషన్‌కే వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జరిగిన జంట హత్యలతో కాశీపూర్ ప్రాంతంలో అందరూ షాక్ అయ్యారు. భయంతో వణికిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!