- Telugu News Photo Gallery Political photos PM Modi commissions largest ship ever built in India INS Vikrant Pics the 18 floor high ship with 2,400 compartments
PM Modi – INS Vikrant: నౌకాదళ అమ్ములపొదిలోకి INS విక్రాంత్.. జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ.. (ఫొటోస్)
INS Vikrant 2022: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాదళానికి అంకితం ఇచ్చారు..
Updated on: Sep 02, 2022 | 4:04 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాదళానికి అంకితం చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మో ఉదయం 9.30 గంటలకు కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ ని ప్రధాని జాతికి అంకితం చేసారు..

అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు మంగళూరులో దాదాపు 3800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం చేసారు.

అంతేకాదు కేరళ పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింప బడిన మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక. తాజా ఆవిష్కరణతో ప్రపంచంలో ఈ మైలురాయిని సాధించిన ఆరో దేశంగా భారత్ అవతరించింది.

ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను మోహరించడం వల్ల హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, భద్రత మరియు స్థిరత్వం పెరుగుతాయని భారత నౌకాదళ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ స్వదేశీ విమాన వాహక నౌక పొడవు, వెడల్పు రెండున్నర హాకీ ఫీల్డ్‌లకు సమానం.

ఈ విమాన వాహన నౌక విధులను నిర్వహించడానికి రంగంలోకి దిగిన నేపథ్యంలో దేశ భద్రతను మరింత బలోపేతంమవుతుంది.

నౌకాదళ అమ్ములపొదిలోకి INS విక్రాంత్ సంబంధించిన ఫొటోస్..

నౌకాదళ అమ్ములపొదిలోకి INS విక్రాంత్ సంబంధించిన ఫొటోస్..




