Lufthansa strike: పైలట్ల సమ్మెతో నిలిచిపోయిన 800 విమానాలు.. ఢిల్లీలో ప్రయాణికులకు తప్పని తిప్పలు..
ఓ ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ పైలట్లు స్ట్రైక్ మొదలు పెట్టారు. దీంతో శుక్రవారం మొత్తం 800 విమానాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఉద్యోగులు సమ్మేలో ఉండటంతో ఆ సంస్థ మొత్తం సర్వీసులను రద్దు చేసింది. దీని కారణంగా..
జీతాలు పెంచాలంటూ జర్మనీకి చెందిన ఓ ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ పైలట్లు స్ట్రైక్ మొదలు పెట్టారు. దీంతో శుక్రవారం మొత్తం 800 విమానాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఉద్యోగులు సమ్మేలో ఉండటంతో ఆ సంస్థ మొత్తం సర్వీసులను రద్దు చేసింది. దీని కారణంగా, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 800 విమానాలు కూడా రద్దు చేయబడ్డాయి. దీంతో 1,30,000 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది 5.5 శాతం జీతాలు పెంచాలని లుఫ్తాన్సా పైలట్లు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అయితే వీరి ప్రతిపాదనకు యాజమాన్యం నిరాకరించింది. సీనియర్ పైలెట్లకు 900 యూరోలు అంటే 5 శాతం, కొత్త ఉద్యోగులకు 18 శాతం మేర జీతాలు పెంచుతామని తేల్చి చెప్పింది. ఈ ఆఫర్‌ను పైలెట్ల యూనియన్ నిరాకరించారు. ముందుస్తుగా హెచ్చరించారు. యాజమాన్యం దిగిరాకపోవడంతో వీరు సమ్మె బాట పట్టారు. ఈ ప్రభావం మన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై కూడ పడింది.
ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్‌కు వెళ్లాల్సిన రెండు లుఫ్తాన్సా విమానాలను సంస్థ రద్దు చేసింది. దీంతో సుమారు 150 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల బంధువులు ఆందోళనకు దిగారు.
Massive impact of VC pilots’ union strike announcement for September 2: Approximately 800 flights and 130,000 @lufthansa and @Lufthansa_Cargo passengers to and from @Airport_FRA and @MUC_Airport expected to be affected. ➡️ More information: https://t.co/WNDcoU1EU0 pic.twitter.com/KaJ2xfznbN
— Lufthansa News (@lufthansaNews) September 1, 2022
వారి తరఫున వచ్చిన బంధువులు.. శుక్రవారం తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో డిపార్చర్ గేట్ నెంబర్.1, టెర్మినల్ 3, ఎయిర్‌పోర్టు ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళన మొదలు పెట్టారు. టికెట్ల డబ్బును వెనక్కు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులను తిరిగి ఇవ్వకుంటే తమ బంధువులకు ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేయాలని ఆందోళన నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం