ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం.. అర్థరాత్రి రెచ్చిపోయిన దుండగులు.. భయానక దృశ్యాలు..!

వేగంగా విస్తరించిన సైన్స్‌తో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ అభివృద్ధి రాకెట్ స్పీడ్ లో దూసుకు పోతుంటే, మరో వైపు జనాల్లో మూఢ నమ్మకాలు కూడా జెట్ స్పీడ్ లో పెరుగుతున్నాయి.

ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం.. అర్థరాత్రి రెచ్చిపోయిన దుండగులు.. భయానక దృశ్యాలు..!
Black Magic
Follow us

|

Updated on: Sep 02, 2022 | 12:12 PM

Telangana: కాలంతో పోటీ ప‌డుతూ మ‌నిషి అభివృద్దిలో దూసుకుపోతున్నాడు. అంత‌రిక్షంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకున్నాడు. మరోవైపు కొందరు అర్థంలేని అజ్ఞానం, మూఢ‌న‌మ్మ‌కాల ఊబిలోనే కొట్టుకుపోతున్నారు. మూఢ నమ్మకాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. వేగంగా విస్తరించిన సైన్స్‌తో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ అభివృద్ధి రాకెట్ స్పీడ్ లో దూసుకు పోతుంటే, మరో వైపు జనాల్లో మూఢ నమ్మకాలు కూడా జెట్ స్పీడ్ లో పెరుగుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో క్షుద్రపూజలు, మంత్రాల భయంతో ప్రజలు వణికి పోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబురు గ్రామంలో విచిత్ర పూజలు జరిపిన ఆనవాళ్లు చూసి స్థానికులు హడలెత్తిపోయారు. వివరాల్లోకి వెళ్తే..

తుంబురు గ్రామంలోని శివ గంగ వాటర్ ప్లాంట్ వద్ద కొందరు దుండగులు అర్ధరాత్రి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు తో ముగ్గులు వేశారు. దీంతో ఉదయాన్నే నిద్రలేచిన వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ఆ ముగ్గులు చూసి షాక్ కు గురయ్యారు. ఎవరో చేత బడి చేస్తున్నారని…గతంలో కూడా ఇలానే చేశారని నిర్వాహకులు వాపోతున్నారు. చిన్న పిల్లలతో ఉంటున్నాము.. ఇలాంటి క్షుద్ర పూజలతో నిత్యం భయం భయంగా బతకాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

ఇలాంటి క్షుద్రపూజలు, చేతబడులు చేసేవారికి తగిన అవగాహన కల్పించాలని, మరోమారు ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి