Telangana: కలుపు తీస్తుండగా వరిపొలంలో అలికిడి.. కూలీలు ఏంటా అని చూడగా గుండెలు గుభేల్
పొలంలో కూలీలకు ఏదో భారీ ఖాయం పాకుతూ వెళ్లడం కనిపించింది. దీంతో కాస్త భయంగానే అక్కడికి వెళ్లి చూసి.. కంగుతిన్నారు.
Viral Video: ప్రజంట్ రెయినీ సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలను వరదనీరు చుట్టుముడుతుంది. ఇది ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆ నీటిలో రకరకాల వన్యప్రాణులు కొట్టుకువచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విషసర్పాలు, మొసళ్లతో పెను ప్రమాదం ఉంటుంది. తాజాగా పంటపొలాల్లో మొసలి కలకలం రేపిన ఘటన వనపర్తి జిల్లా(Wanaparthy District) అమరచింత మండలం ఈర్లదిన్నె(Erladinne)లో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో పంట పొలాల్లో 11 అడుగుల భారీ మొసలి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. వరి పొలంలో కలుపు తీస్తుండగా కూలీలకు ఏదో అలికిడి వినిపించింది. పొలంలో ఏదో భారీ ఖాయం పాకుతున్నట్లు అర్థమైంది. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూడగా అది భారీ మొసలి. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. పొలం యజమాని నరసింహులు స్థానిక ఎస్సైకి సమాచారం ఇచ్చారు. ఎస్సై… సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్‌ను వెంటబెట్టుకుని ఈర్లదిన్నె గ్రామానికి చేరుకున్నారు. పంట పొలాల్లో వెతికి గ్రామస్తుల సహాయంతో చాకచక్యంగా మొసలిని తాళ్లతో బంధించారు. వాహనంలో జూరాల ప్రాజెక్టు వద్దకు తరలించి, నీటిలో వదిలేశారు. కాగా వన్యప్రాణుల కనిపిస్తే వాటి ప్రాణాలు తీయకుండా.. తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం