Monkeypox: 31 మంది చిన్నారులకు మంకీపాక్స్.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌లు.. అగ్రరాజ్యంలో ఆందోళన..

8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మంకీపాక్స్ బారిన పడినట్లయితే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని CDC హెచ్చరించింది.

Monkeypox: 31 మంది చిన్నారులకు మంకీపాక్స్.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌లు.. అగ్రరాజ్యంలో ఆందోళన..
Monkeypox
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2022 | 6:54 PM

Monkeypox: ప్రపంచ దేశాలను మంకీపాక్స్‌ వణికిస్తోంది. ఇప్ప‌టికీ చాలా దేశాల్లో మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలను హెచ్చరించింది. ఈ క్రమంలోనే అమెరికాలో మంకీపాక్స్‌ కలకలం సృష్టిస్తుంది. దేశంలో ఇప్పటివరకు 31 మంది చిన్నారులకు మంకీపాక్స్‌ సోకింది. 11 రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది. . కాగా, అగ్రరాజ్యంలో మొత్తం 18,417 మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) నిర్ధారించింది. వైరస్‌ కారణంగా టెక్సాస్‌కు చెందిన వ్యక్తి మృతిచెందాడు. అయితే అతని మరణానికి మంకీపాక్సే కారణమని సీడీసీ ఇంకా ధృవీకరించలేదు.

8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మంకీపాక్స్ బారిన పడినట్లయితే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని CDC హెచ్చరించింది. యూనైటెడ్‌ స్టేట్స్‌ 11 రాష్ట్రాల్లో పిల్లలో మంకీపాక్స్‌ కేసులు వెలుగులోకి బయటపడ్డాయి. వీటిలో ముఖ్యంగా ఒక్క టెక్సాస్‌లో మాత్రమే తొమ్మిది మంది చిన్నారులకు మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది.

ఇకపోతే, మంకీపాక్స్ అనేది వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్), ఇది గతంలో మశూచి రోగులలో కనిపించే లక్షణాలతో ఉంటుంది. అయితే ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతను కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి