AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఆమె అదృష్టం బాగుంది బ్రదరూ.. లేకుంటే మరీ ఇలానా.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

రోడ్డుపై నడుస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే చిన్న పొరపాటైనా అది మన ప్రాణాలనే తీసేస్తుంది. అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. డ్రైవింగ్ చేసే సమయంలో..

Video Viral: ఆమె అదృష్టం బాగుంది బ్రదరూ.. లేకుంటే మరీ ఇలానా.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
Accident Video Vrial
Ganesh Mudavath
|

Updated on: Sep 03, 2022 | 10:08 AM

Share

రోడ్డుపై నడుస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే చిన్న పొరపాటైనా అది మన ప్రాణాలనే తీసేస్తుంది. అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, వేగంగా వెళ్లడం వంటి చర్యలకు పాల్పడుతుంటారు. కనీసం రోడ్డు నియమాలనూ పాటించకుండా దూసుకుపోతుంటారు. అయితే రోడ్డుపై నడిచేటప్పుడు ఎప్పుడూ ఎడమ వైపునే నడవాలనే విషయం మనకు తెలిసిందే. అయితే కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇవి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రమాదాలు కొన్నిసార్లు విధ్వంసం సృష్టిస్తాయి. మరికొన్ని సార్లు అనుభవ పాఠాన్ని నేర్పిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న క్లిప్ లో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ రెండింటి మధ్య ఒక మహిళ ఉంటుంది. ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే ఆమె ప్రాణాలు పోయాయని అనిపించినా.. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది.

కేవలం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఓ కారు అదుపుతప్పి ఆమె వైపు దూసుకొస్తుంది. వేగంగా వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఆటోను ఢీ కొడుతుంది. ఈ ప్రమాదంలో కారు, ఆటో రెండింటికి మధ్యలో మహిళ ఉంది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఏమీ కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రెండు వాహనాలు బోల్తా పడిన తర్వాత మహిళ తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 35 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..