Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశాలు.. అధ్యక్షత వహించనున్న సీఎం.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ

తెలంగాణ (Telangana) మంత్రివర్గం ఇవాళ (శనివారం) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్​లో జరగనున్న ఈ సమావేశంలో...

Telangana: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశాలు.. అధ్యక్షత వహించనున్న సీఎం.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ
Cm Kcr
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 03, 2022 | 8:30 AM

తెలంగాణ (Telangana) మంత్రివర్గం ఇవాళ (శనివారం) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్​లో జరగనున్న ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 6 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో చర్చించాల్సిన అంశాలతో పాటు టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చిస్తారు. విపక్షాలను దీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్ష, ఎన్డీఏ తీరుపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన నిధులు, విద్యుత్ బకాయిలు, భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం కలిసి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వజ్రోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. ఇవే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు అందించాల్సిన డీఏలు, జిల్లాల్లో పోడు భూముల సమస్యల పరిష్కారం, రెవెన్యూ శాఖకు భూ కేటాయింపులు వంటి అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉంది.

రెవెన్యూ శాఖకు సంబంధించి గతంలో చేసిన భూ కేటాయింపులకు ఆమోదం, మలక్‌పేటలో సచివాలయ ఉద్యోగుల క్వార్టర్స్ స్థలాన్ని ఐటీ హబ్‌కు కేటాయించే అంశం, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, వీటితో పాటు మునుగోడు ఉపఎన్నిక అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, శాసనమండలి భేటీ ఈ నెల 6 న ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వీ.నర్సింహా చార్యులు ప్రకటన విడుదల చేశారు. శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు ఈ నెల 15వ తేదీ వరకు జరిగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..