APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. ఏసీ బస్సుల ఛార్జీల తగ్గింపు.. ఎంతమేరనంటే?
Andhra Pradesh: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏసీ బస్సు ఛార్జీల్లో 20శాతం వరకు తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల తగ్గింపు ఈనెల 30వరకు అమల్లో ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Apsrtc
Andhra Pradesh: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏసీ బస్సు ఛార్జీల్లో 20శాతం వరకు తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల తగ్గింపు ఈనెల 30వరకు అమల్లో ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. రూట్లు, ఛార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయం ఆర్టీసీ రీజినల్ మేనేజర్(RM)లకు అప్పగించింది. ఈనేపథ్యంలో ఛార్జీల తగ్గింపుపై ఆయా జిల్లాల ఆర్టీసీ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.
తగ్గించిన ఛార్జీల వివరాలివే..
- విజయవాడ-హైదరాబాద్ మార్గంలో తిరిగే అమరావతి, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల్లో టికెట్ ధరల్లో 10 శాతం మేర తగ్గించారు.
- విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ , విజయవాడ-చెన్నై, విజయవాడ-బెంగళూరు వెళ్లే ఏసీ బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గించారు.
- శుక్రవారం, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఛార్జీల తగ్గింపు అమల్లో ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ సూచించింది.
ఇవి కూడా చదవండి

Fact Check: అయోధ్య రామ మందిరానికి కేజీఎఫ్ హీరో రూ.50 కోట్ల విరాళం.. అసలు విషయం ఏంటంటే ?

Katrina Kaif: అందుకే మేం రహస్యంగా పెళ్లి చేసుకున్నాం.. అసలు విషయం చెప్పేసిన మల్లీశ్వరి

Viral Video: సూర్య సుడిగాలి ఇన్నింగ్స్‌కు కోహ్లీ ఫిదా.. ఏం చేశాడో తెలుసా? ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న వీడియో

Chiranjeevi: మా నాన్న రోడ్డుపై పరుగెత్తించి కొట్టారు.. ఫస్డ్ డే ఫస్ట్ షో అనుభవాన్ని పంచుకున్న మెగాస్టార్
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..