Telangana Liberation Day: టీఆర్‌ఎస్‌పై బీజేపీ మరో అస్త్రం.. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం.. కేంద్రం ఆధ్వర్యంలో..

కేంద్ర సాంస్కృతిక, హోం మంత్రిత్వశాఖ అధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక కార్యదర్శితో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

Telangana Liberation Day: టీఆర్‌ఎస్‌పై బీజేపీ మరో అస్త్రం.. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం.. కేంద్రం ఆధ్వర్యంలో..
Modi Amith Shah Kishan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 02, 2022 | 9:31 PM

Telangana Vimochana Dinotsavam: తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ టీఆర్‌ఎస్‌పై మరో అస్త్రాన్ని విసిరింది. తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవాన్ని కేంద్రం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాంస్కృతిక, హోం మంత్రిత్వశాఖ అధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శితో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో పరేడ్‌ జరగనుంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా గౌరవ వందనం స్వీకరించనున్నారు. సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు. మహారాష్ట్ర, కర్నాటకతో తెలంగాణ విమోచనానికి లింక్‌ ఉండటంతో ఏక్నాథ్ షిండే, బసవరాజు బొమ్మైకు ఆహ్వానం కూడా పంపించారు. గతంలో నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు జిల్లాలు ఉండటంతో.. వారిని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు సన్నాహాలు చేశారు.

భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా.. కేంద్రం ఏడాది పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహించింది. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కూడా అమృతోత్సవాలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో కేంద్రం వియోచన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది.

కాగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కూడా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. నిజాం నుంచి తెలంగాణ విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. అయితే.. దీనిపై శనివారం జరిగే కేబినెట్, ఎల్పీ సమావేశాల్లో చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?