Health Tips: రాత్రి వేళ లైట్లు ఆర్పకుండానే నిద్రపోతున్నారా..? ఆ సమస్యల బారిన పడతారట.. జాగ్రత్త..!

మంచి ఆరోగ్యం.. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే.. కనీసం 8 గంటలపాటు నిద్ర పోవడం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.

Health Tips: రాత్రి వేళ లైట్లు ఆర్పకుండానే నిద్రపోతున్నారా..? ఆ సమస్యల బారిన పడతారట.. జాగ్రత్త..!
Sleeping Mistakes
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 01, 2022 | 9:24 PM

Sleeping While Light On: మంచి ఆరోగ్యం.. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే.. కనీసం 8 గంటలపాటు నిద్ర పోవడం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. నిద్ర అనేది అలసట నుంచి ఉపశమనం కలిగించే థెరపీ లాంటిది. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మెదడు సరిగ్గా పని చేస్తుంది. దీని కారణంగా కండరాలు బలంగా మారుతాయి.. అంతేకాకుండా మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. నిద్ర అనేక వ్యాధుల ప్రమాదాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తుంది. అయితే మనం నిద్రలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మనం చేసే పొరపాట్ల మూలంగా శరీరానికి హాని కలుగుతుంది.

నిద్రపోయేటప్పుడు ఇలాంటి పొరపాటు చేయకండి..

సాధారణంగా మనం రాత్రి పడుకునేటప్పుడు గదిలోని లైట్లు ఆఫ్ చేస్తాము. తద్వారా మనకు ఉపశమనం లభిస్తుంది. కానీ కొంతమంది ఇలా చేయరు.. వారు లైట్లు వేసుకొని మరి నిద్రించడానికి ఇష్టపడతారు. లైట్లను రాత్రంతా అలాగే ఉంచుతారు. కొంతమంది స్విచ్ ఆఫ్ చేయాలా..? అనే సోమరితనంతో అలానే ఉంచుతారు. లైట్ వెలిగించి నిద్రించడం ఆరోగ్యానికి చాలా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

లైట్లు వెలిగించి నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు..

డిప్రెషన్..

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి కాంతి ఎంత అవసరమో, చీకటి కూడా అంతే ముఖ్యం. స్వీడన్, నార్వే వంటి ధ్రువ దేశాలలో వేసవి కాలంలో దాదాపు 6 నెలల పాటు సూర్యుడు అస్తమించడు అని మీరు వినే ఉంటారు. రాత్రి వేళ తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది డిప్రెషన్‌కు గురవుతుంటారు. మరోవైపు భారత్ లాంటి దేశాల్లో వెలుతురులో పడుకోవాలంటే ఎలక్ట్రానిక్ లైట్లను వినియోగించాల్సి ఉంటుంది. వీటి నుంచి వెలువడే నీలి కాంతి మిమ్మల్ని చికాకు కలిగిస్తుంది. కావున వీలైనంత తక్కువ వెలుతురులో పడుకోవడం మంచిది.

అనేక వ్యాధుల ప్రమాదం..

మీరు నిరంతరం లైట్లు వెలిగించి నిద్రపోతుంటే మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది. కాంతి వల్ల నిద్ర పట్టదు. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బులు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదానికి దారి తీస్తుంది. అందువల్ల, లైట్లు వేసుకుని నిద్రపోవడం లాంటి తప్పులను ఎప్పుడూ చేయవద్దు.

అలసట..

సాధారణంగా లైట్లు వేసుకుని నిద్రపోవడం వల్ల నిద్ర పట్టదు. దాని ప్రభావం మరుసటి రోజు కనిపిస్తుంది. ఇది పని చేయడాన్ని కష్టతరం చేస్తుంది. ఎందుకంటే మీరు అలసట, ఏకాగ్రత కోల్పోవడం వల్ల బద్ధకం బారిన పడతారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..